Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తారకరత్న ఇంటివద్ద విజయసాయి రెడ్డి, చంద్రబాబు ఫోటోపై.. బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్!!

తారకరత్న ఇంట్లో చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఫోటోపై బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్ చేశారు.

నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబాన్ని, టిడిపి శ్రేణులను, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచేసింది. నందమూరి తారకరత్న మరణం నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని ఓదారుస్తున్నారు. ఇక ఇదే సమయంలో అలేఖ్య రెడ్డికి పెదనాన్న అయిన విజయసాయిరెడ్డి కూడా అక్కడే ఉండి, అలేఖ్య రెడ్డి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. ఈ సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో అందరి దృష్టి కేంద్రీకృతమయ్యేలా చేసింది.

విజయసాయి రెడ్డి, చంద్రబాబు ఫోటోపై దుమారం రేపిన బండ్ల గణేష్ ట్వీట్

రాజకీయంగా బద్ధ శత్రువులైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పక్క పక్కన కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకోవడం అందరినీ ఆలోచించేలా చేసింది. అయితే పరిస్థితిని బట్టి అని అంతా సైలెంట్ గా ఉన్నారు. తారకరత్న మృతితో కష్ట సమయంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన వారు రాజకీయాలను పక్కనపెట్టి, పరామర్శించుకోవడం తప్పేమీ లేదన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతుంది. అయితే ఇదే సమయంలో సినీ నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు, విజయ్ సాయి రెడ్డిల ఫోటోలపై, వారిద్దరూ పక్కనే కూర్చుని మాట్లాడుకోవడం పై బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు.

అత్యంత బాధాకరమైన విచిత్రం అంటూ బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్

అత్యంత బాధాకరమైన విచిత్రం అంటూ బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్

బండ్ల గణేష్ చేసిన ట్వీట్లో "నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చుని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా... అది నా నైజం అంటూ వ్యాఖ్యలు చేశారు. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి అంటూ బండ్ల గణేష్ చంద్రబాబు విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ దుమారంగా మారుతుంది.

బండ్ల గణేష్ పోస్ట్ పై నెటిజన్ ల మండిపాటు

బండ్ల గణేష్ పోస్ట్ పై నెటిజన్ ల మండిపాటు

ఇక బండ్ల గణేష్ సందర్భానికి తగినట్టుగా మాట్లాడలేదని, ఆయన చేసిన పోస్ట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయాలు వేరు.. బంధుత్వాలు వేరు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు సమయం, సందర్భం చూసి చేయాలని, అక్కడ పరిస్థితి ఏమిటని బండ్ల గణేష్ ను ప్రశ్నిస్తున్నారు. తారకరత్న విజయ సాయి రెడ్డి అల్లుడు, నందమూరి వారసుడు .. అర్థం లేకుండా మాట్లాడకు అంటూ బండ్ల గణేష్ పై మండిపడుతున్నారు. కష్టకాలంలో ఒకే సమయంలో కలవాల్సి వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు.. అందులో తప్పు లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు.

 ఆంధ్రప్రదేశ్ జనాలకి అర్థం చేసుకునే శక్తి ఉందని టీడీపీ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ జనాలకి అర్థం చేసుకునే శక్తి ఉందని టీడీపీ క్లారిటీ


దీనిపై టీడీపీ శ్రేణులు కూడా స్పందిస్తున్నారు. అక్కడ సందర్భం వేరు సమయం వేరు. ఇంటికొచ్చిన శత్రువు నైనా మంచినీళ్ళు ఇచ్చి పలకరించే సంప్రదాయం మనది. చంద్రబాబునాయుడు స్థితప్రజ్ఞుడు. ఆయన వ్యక్తిత్వం ఎవరెస్ట్ శిఖరం. మా పార్టీలోని ప్రతి కార్యకర్త కి ఆయనంటే విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ జనాలకి అర్థం చేసుకునే శక్తి ఉంది అంటూ ఆ ఫోటోపై, చంద్రబాబు విజయసాయి రెడ్డితో మాట్లాడటంపై క్లారిటీ ఇస్తున్నారు. దీనికి రాజకీయాలకు సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు.

సమయం సందర్భం లేకుండా ఈ ట్వీట్ లు ఏంటి? అని ఆగ్రహం

సమయం సందర్భం లేకుండా ఈ ట్వీట్ లు ఏంటి? అని ఆగ్రహం

బండ్లన్నా .. రాజకీయాల్లో సైద్దాంతికంగా విభేదాలు ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా కాదని హితవు చెబుతున్నారు. రాజకీయాలలో అసలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరని గుర్తు చేస్తున్నారు. మరికొందరు నువ్వు నీ పిచ్చి ట్వీట్స్ అంటూ బండ్ల గణేష్ పై మండిపడుతున్నారు. అసలు నువ్వు చేసే ట్వీట్ లకు అర్ధం పర్ధం .. సమయం సందర్భం ఉండదా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వారైనా కష్ట సమయాల్లో ఇలా మాట్లాడకూడదు అంటున్నారు బండ్ల గణేష్ పోస్ట్ చూసిన నెటిజన్లు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+