వాడికి ఓటమి తప్పదు.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. గత కొంతకాలంగా ఆయన వరుసగా వార్తల్లో నిలుస్తున్నారాయన. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన మీడియాలో తెగ హల్ చల్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బండ్ల గణేష్ ప్రచారం కూడా నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంత ఇంత కాదు.
ఫలితాల సమయంలో తనదైనశైలిలో బీఆర్ఎస్ పార్టీపై ట్వీట్లు చేశారాయన. బండ్ల గణేష్ పవన్ కల్యాణ్‌కు వీర భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ నటించిన తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కుకున్నారు.

నా సినిమాలకు కోసం నేను ఎవరినైనా పొగుడుతానని .. అందరి హీరోలు నాకు సమానమే అని ఆయన చెప్పుకొచ్చారు. పైగా ఏపీలో జగన్‌గారి పాలన బాగుందని..నాకు తెలిసిన వ్యక్తికి వైద్య సాయం చేశారని.. ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తి దేవుడుతో సమానమని చెప్పి జగన్ సర్కార్ మీద ప్రశంసలు కురిపించారు.
గెలిచిన వానికి ఓటమి తప్పదు
— BANDLA GANESH. (@ganeshbandla) February 10, 2025
ఓడిన వానికి గెలువక తప్పదు
అనివార్యమైన ఇట్టి విషయమై శోకింప తగదు .
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సమయంలో బండ్ల గణేష్ జగన్‌పై విమర్శలు కూడా చేశారు.ఇటీవల విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు.దీనిపై కూడా బండ్ల గణేష్ రియాక్డ్ అయ్యారు.అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయిపోయింది, ఇది ధర్మమా.. అని విజయసాయి రెడ్డిని బండ్ల గణేష్ ప్రశ్నించారు.
తాజాగా బండ్ల గణేష్ రాజకీయాలపై ట్వీట్ చేశారు.''గెలిచిన వానికి ఓటమి తప్పదు.. ఓడిన వానికి గెలువక తప్పదు.. అనివార్యమైన ఇట్టి విషయమై శోకింప తగదు'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి చేశారో అర్దం కావడం లేదు. బండ్ల గణేష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన ఆ పార్టీ ఓడిపోవాలని అనుకోరు. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వాన్నే ఆయన హెచ్చరించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications