బ్యాంకులకు వరుస సెలవులు, వినియోగదారులకు RBI అలర్ట్..!!

కొత్త ఆర్దిక సంవత్సరంలో తొలి నెల పూర్తయింది. మే నెలలో బ్యాంకులకు సెలవులను ఆర్బీఐ ఖరారు చేసింది. అటు విద్యా సంస్థలకు వేసవి సెలవులు మొదలయ్యాయి. మే నెలలో దాదాపు 12 రోజులు సెలవులు ఉన్నాయి. సంబంధిత రాష్ట్రాల్లోని పర్వదినాలు.. పండుగలకు అనుగుణం గా సెలవులు నిర్ధారించనున్నారు. భారీగా సెలవులు ఉండటంతో వినియోగదారులకు బ్యాంకులు కీలక సూచనలు చేస్తున్నాయి. ముందస్తుగానే అప్రమత్తం కావాలని సూచిస్తున్నాయి.

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2026 నెలకు సంబంధించి బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ నెలలో ఆదివారాలు, శనివారాలతో పాటు వివిధ పండుగల కారణంగా మొత్తం 12 రోజులు బ్యాంకులు పనిచేయవు. మే నెల మొదలవుతున్న నేపథ్యంలో బ్యాంక్ పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మే నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు ప‌నిచేయ‌వు. ఈ సెలవుల్లో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు పలు పండుగలు కూడా ఉన్నాయి. మే 1న బుద్ధ పూర్ణిమ, మే డే సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. అలాగే మే 9, 23 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు, మిగతా ఆదివారాలు కూడా సెలవులుగా ఉంటాయి. ఇక మే 27న బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. కొన్ని ప్రాంతాల్లో మే 28న కూడా అదనపు సెలవు ఉంటుంది.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ నుంచి ఔట్, అసలు కారణం..!?
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ నుంచి ఔట్, అసలు కారణం..!?
bank-holidays-complete-list-for-may-2026-as-rbi-guide-lines-is-here-suggestions-for-banking-custome

వినియోగదారులకు అలర్ట్

మే నెల ప్రారంభంలోనే లాంగ్ వీకెండ్ అవకాశం ఉంది. మే 1 శుక్రవారం సెలవు కావడంతో, దాని తర్వాత శని, ఆదివారాలు కలిసి వరుసగా మూడు రోజులు బ్యాంకులు ప‌నిచేయ‌వు. ఈ స‌మ‌యంలో బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. ముఖ్యంగా డ్రాఫ్ట్‌లు, చెక్ డిపాజిట్‌లు, డాక్యుమెంట్ సమర్పణ వంటి పనులు ఆలస్యమవకుండా జాగ్రత్తపడాలి. ఆన్‌లైన్ సేవలు యథాతథం బ్యాంకులు మూసివేసిన రోజుల్లో కూడా కస్టమర్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. UPI లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. అలాగే ATMల ద్వారా నగదు తీసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. దీంతో.. వినియోగదారులు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+