షిరిడీ హుండీలోని నాణాలను తీసుకోమంటున్న బ్యాంకులు

షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ను ఒక సమస్య వేధిస్తోంది. బాబా హుండీలోకి కోట్లల్లో నాణేలు వస్తున్నాయి. వాటిని ఎలా వినియోగంలోకి తీసుకురావాలో తెలియక, ఎక్కడ డిపాజిట్ చేయాలో తెలియక నిర్వాహకులు తలలు పట్టుకుకూర్చుంటున్నారు. భగవంతుడి హుండీలో నోట్లతో పాటు నాణాలు కూడా వేస్తుంటారు.

వాటిని ఏం చేయాలో.. ఎక్కడ డిపాజిట్ చేయాలో అర్థంకాక ఆలయ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఒక వారంలో సుమారు రూ.7 లక్షల విలువైన నాణాలు, ఒక సంవత్సరంలో రూ.3.5 కోట్ల విలువైన నాణాలు జమవుతుంటాయి. వారానికి రెండుసార్లు హుండీలను లెక్కిస్తుంటారు.

banks not accepet the shirdi hundi coins

షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్ కు వివిధ బ్యాంకుల్లో 13 బ్యాంకు ఖాతాలున్నాయి. అందులో 12 బ్యాంక్ ఖాతాలు షిర్డీలో ఉండగా.. ఒకటి మాత్రం నాసిక్‌లో ఉంది. వీటిల్లో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. ఆలయానికి వచ్చే నాణాలను డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకులు నిరాకరించాయి. వీటివిలువ కోట్లరూపాయల్లో ఉంటుంది. దీంతో నిర్వహణ తమవల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. భారీసంఖ్యలో ఉన్న నాణాలను నిల్వ చేసేందుకు స్థలం దొరకడంలేదని, ఇకనుంచి తాము తీసుకోమని స్పష్టం చేస్తున్నారు.

తమ ఖాతాలున్న 13 బ్యాంకుల్లో ట్రస్ట్ రూ.11 కోట్ల విలువైన నాణాలను డిపాజిట్ చేసింది. వాటి నిర్వహణే భారంగా మారడంతోపాటు ఇప్పుడు కొత్తవాటిని తిరస్కరిస్తున్నారు. నాణాలు బరువు ఎక్కువగా ఉంటుందని, వీటి నిల్వలు మరింత పెరిగితే బ్యాంకు భవనాలు కూలిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. ఇకనుంచి తాము నాణాలను స్వీకరించలేమంటున్నారు.

నాణాలు బరువుగా ఉండటంతోపాటు ఆ బరువుకు భవనాలు కూలిపోయే ప్రమాదముందంటున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు పెరగడంతో మార్కెట్ లో చిల్లర నాణాలను ఎవరూ తీసుకోవడంలేదని, తమ బ్యాంకుల్లో పేరుకుపోయిన నాణాలను తిరిగి తీసుకోవాలంటూ షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ ను బ్యాంకులు కోరుతున్నారు. దీంతో ట్రస్ట్ రిజర్వుబ్యాంకును ఆశ్రయించింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని, అప్పటిలోగా తాత్కాలికంగా ఉపశమనం కోసం బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి అక్కడ నాణాలను డిపాజిట్ చేయాలని భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+