పెద్ద నగదు నోట్ల రద్దుతో వివాహం నిలిచిపోకుండా ఆపాడు
కడప: ;పెద్ద నగదు నోట్ల రద్దుతో అర్థాంతరంగా నిలిచిపోయే వివాహాన్ని ఓ బ్యాంకు మేనేజర్ అడ్డుకొన్నాడు. వివాహం జరిగేలా కృషి చేసిన బ్యాంకు మేనేజర్ ను స్థానికులు అభినందిస్తున్నారు. మేనేజర్ కారణంగా వివాహం జరగడంతో ఆ కుటుంబం సంతోషం ఉంది.
పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరిపై పడింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో అర్థాంతరంగా వివాహాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితినుండి ఓ బ్యాంకు మేనేజర్ రక్షించాడు. మానవత థృక్పథంతో ఆ బ్యాంకు మేనేజర్ చేసిన సేవతో స్థానికులు ఆయనను అభినందించారు.
మైదుకూర్ ఆర్ టి సి బస్ డిపోలో ఎర్రసాని శ్రీనివాసులు కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఆయన తన కుమార్తె వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నాడు. ఈ మేరకు బ్యాంకులో లక్ష రూపాయాలను డిపాజిటి చేశాడు. వివాహ ఖర్చుల కోసం ఒక్క పైసా కూడ తన వద్ద లేదు. బ్యాంకు నుండి లక్ష రూపాయాలను ఒకేసారి డ్రా చేసే పరిస్థితి లేదు.

తన పరిస్థితిని బ్యాంకు మేనేజర్ కు ఆదివారం నాడు వివరించాడు శ్రీనివాస్లు. పదివేల రూపాయాల కంటే ఎక్కువగా తాను డబ్బును డ్రా చేసి ఇవ్వలేనని ఆయన తేల్చి చెప్పాడు.దీంతో తనకు సహాయం చేయాలని ఆయన బ్యాంకు మేనేజర్ ను ప్రాధేయపడ్డాడు.
శ్రీనివాసులు పరిస్థితిని అర్థం చేసుకొన్న బ్యాంకు మేనేజర్ తనకు తెలిసిన వారికి చెందిన 10 మంది అకౌంట్లలో పదివేల రూపాయాలను డిపాజిటు చేయించాడు. వారి వద్ద నుండి పదివేల రూపాయాలను డ్రా చేయించి లక్ష రూపాయాలను శ్రీనివాసులు చేతిలో పెట్టాడు.దీంతో శ్రీనివాసులు కష్టాలు తీరాయి. ఆయన కుమార్తె వివాహానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications