వైసీపీ హైకమాండ్ పరిస్థితి ఇదేనా ?, మాజీ ఎంపీకి నో బెయిల్, మైండ్ బ్లాక్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా గుంటూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అయితే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ షరతులతో కూడిన బెయిల్ కు పూచికత్తు సమర్పించక పోవడంతో ఆయన జైలు నుండి బయటకు రాలేకపోయారు. ప్రస్తుతం నందిగం సురేష్ గుంటూరు జైల్లోనే ఉన్నారు. ఇదే సమయంలో మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ పై వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేయడానికి అనుమతించడంతో పోలీసులు మరోసారి నందిగం సురేష్ ను అరెస్టు చేశారు.

2020లో వెలగపూడి లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో జరిగిన దాడిలో మరియమ్మ అనే మహిళ చనిపోయింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మరియమ్మ కుటుంబ సభ్యులు కేసు కూడా పెట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆపార్టీకి చెందిన అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేయలేదు. కొన్ని రోజులకే కేసు దర్యాప్తు మరుగున పడిపోయింది.
ఆ తరువాత అధికారంలో ఉన్న వైసీపీ నాయకులను ఎదిరించలేక, ఏం చెయ్యాలో తెలీక మరియమ్మ కుటుంబ సభ్యులు కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. నందిగం సురేష్ ను అరెస్టు చేసిన తర్వాత మరియమ్మ కుటుంబ సభ్యులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు.

మాజీ ఎంపీ నందిగం సురేష్ కారణంగానే గొడవలు జరిగాయని, ఆయన రెచ్చగొట్టడం వలనే వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో మరియమ్మ చనిపోయిందని, ఈ కేసు మరోసారి దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని మరియమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు మనవి చేశారు. మరియమ్మ కేసు మరోసారి దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటికే జైల్లో ఉన్న నందిగం సురేష్ ను విచారణ చేయడానికి కోర్టులో పీటీ వారెంట్ వేశారు. పీటీ వారెంట్ విచారణ చెయ్యడానికి కోర్టు అనుమతించడంతో పోలీసులు నందిగం సురేష్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.

మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను ఈనెల 21వ తేదీ వరకు రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయన్ను జైలుకు తరలించారు. కేసులో పూచికత్తు సమర్పించ లేక ఓ మాజీ ఎంపీ జైల్లోనే ఉండటం మరో హత్య కేసులో ఆయన అరెస్టు కావడం ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు అధికారం కోల్పోయిన మూడు నెలలకే ఓ మాజీ ఎంపీకి పూచికత్తు సమర్పించ లేకపోవడం వినడానికి వింతగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications