రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్

పాఠశాలలకు, కళాశాలలకు దసరా సెలవులు ఇచ్చేశారు. ఈ ప్రభావం రైళ్లపై పడుతుంది. అవి తీవ్రమైన రద్దీతో నడుస్తుంటాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఒకవైపు లగేజ్, మరోవైపు పిల్లలు, ఇంకోవైపు వృద్ధులు.. వీరితో వెళ్లాల్సిన స్టేషన్ కు చేరుకోవాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. విజయవాడ రైల్వేస్టేషన్ లో లగేజ్ సమస్యలకు చెక్ పెట్టారు అధికారులు.

రూ.50 చెల్లిస్తే : అధిక లగేజ్ తో ప్రయాణించేవారి కోసం బ్యాటరీ ఛార్జ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ వీటిని ప్రారంభించారు. వీటిద్వారా వృద్ధులు, చిన్నపిల్లలు తేలిగ్గా ప్లాట్ ఫారం దగ్గరకు చేరుకోవచ్చు. వీటినిఉపయోగించుకోవాలనుకునేవారు రూ.50 చెల్లిస్తే వారు చేరుకోవాల్సిన ప్లాట్ ఫారంకు తరలిస్తారు.

battery charjed vehicle start in vijayawada railway station

ఏకకాలంలో రవాణా : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంపైనే రైల్వే దృష్టి సారించింది. వీటిల్లో భాగంగానే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. మరోవైపు ప్రయాణికులను, లగేజ్ ను ఒకేసారి రవాణా చేసేలా డబుల్ డెక్కర్ రైళ్లను తీసుకురాబోతోంది. పై అంతస్తులో ప్రయాణికులు, కింద సరకు రవాణా ఏకకాలంలో జరుగుతుంది.

త్వరలోనే దేశవ్యాప్తంగా : తాజాగా ఢిల్లీ-మీరట్ మధ్య ర్యాపిడ్ రైల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం ను ప్రారంభించనున్నారు. మనదేశంలో 160 కిలోమీటర్ల వేగం కలిగివున్న మొట్టమొదటి రైల్వే వ్యవస్థ. 2019లో ప్రధానమంత్రి దీనికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మీరట్-ఢిల్లీ మధ్య సాధారణ రైలులో గంటన్నర సమయం పడుతోంది. ఆర్ఆర్ టీఎస్ వల్ల కేవలం 55 నుంచి 60 నిముషాల సమయం మాత్రమే పడుతుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించే పనులు చేపట్టబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+