అల్పపీడనం దెబ్బకు ఏపీలో కుమ్మిపడేస్తోన్న భారీ వర్షాలు

Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో దంచికొడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

పశ్చిమమధ్య- దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

Bay of Bengal Heavy Rainfall Foretasted in Andhra Pradesh Today

మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లకూడదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు అక్కడక్కడ చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు కురుస్తాయి.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తాయని పేర్కొన్నారు.

బుధవారం ఉదయం 8.30 గంటల నుండి గురువారం ఉదయం 8.30 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ 24 గంటల వ్యవధిలో ఇక్కడ 94 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అంబేద్కర్ కోనసీమ- 90.8, పశ్చిమ గోదావరి- 90, ఏలూరు- 65.8, కాకినాడ 57.7, తూర్పు గోదావరి- 50.4 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది.

గురువారం ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 52 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం- 48.2, ఏలూరు జిల్లా కోటపాడు- 40.2, అనకాపల్లి- 38, అదే జిల్లాలోని గంధవరం- 38 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

గురువారం ఉదయం 8: 30 గంటల వరకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు- 236.6, ఇరగవరం- 196.6, పెనుగొండ- 193.8, పెంటపాడు- 189.0, నిడమర్రు- 182.4, ఉండ్రాజవరం- 180.6, జగ్గయ్యపేట- 176.6, పెరవలి- 170.6, అంబాజీపేట- 167.8, నందిగామ- 165.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+