బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫానుగా మారే ఛాన్స్ - ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!!
ఏపీకి మరో తుఫాను వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరి తల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 15 నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫానుగా మారే అవకాశాల పైనా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. తాజాగా కీలక సూచనలు చేసారు.
వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. 14వ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా, 15వ తేదీకల్లా వాయుగుండంగా బలపడనున్నది. ఆతర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించి మరింత బలపడి తుఫాన్‌గా మారి 17వ తేదీ తర్వాత ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనున్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే వాయుగుండం ఎటు పయనిస్తుందో ఇంకా స్పష్టత రాలేదని, దీని ప్రభావం ఏపీపై ఉండకపోవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
కాగా.. యానంలో.. తెలంగాణ ప్రాంతంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాతో పాటుగా రాయలసీమ, తమిళనాడు జిల్లాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో రెండు రెండు రోజుల్లో తుఫాను పైన పూర్తి స్పష్టత వస్తుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications
