వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీ రెడీ! పవన్‌ కళ్యాణ్‌కు వాపు-బలుపు తెలుసు, అక్కడ బలంపై టీడీపీ-వైసీపీ ఆరా

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఆయన నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదలకు సిద్ధమైంది. మంగళవారం రాత్రి (19-12-2017) ఆడియో విడుదలయింది. జనవరి 10న సినిమా విడుదల కానుంది.

Recommended Video

అజ్ఞాతవాసి నిజంగా పవన్ ఆఖరి సినిమా నా ?

కాంగ్రెస్‌తో కలిశావ్, మేం చెప్పామా, పవన్ కళ్యాణ్ వల్లే: బాబుపై వీర్రాజు సంచలనంకాంగ్రెస్‌తో కలిశావ్, మేం చెప్పామా, పవన్ కళ్యాణ్ వల్లే: బాబుపై వీర్రాజు సంచలనం

ఇక, పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఇటీవలే ఆయన ఓ ప్రకటన చేశారు. కొద్దిరోజుల క్రితం ఏపీ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ.. తాను సినిమాలను వదిలేస్తున్నానని తన అభిమానులను నిరాశకు గురి చేశారు.

మీ మాట నమ్మి వాజపేయి ఓడిపోయారు, నోట్లు పంచి గెలిచారు: బాబును దులిపిన వీర్రాజుమీ మాట నమ్మి వాజపేయి ఓడిపోయారు, నోట్లు పంచి గెలిచారు: బాబును దులిపిన వీర్రాజు

ప్రజల కోసం సినిమాలు వదిలేస్తున్నారు

ప్రజల కోసం సినిమాలు వదిలేస్తున్నారు

పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండుగే. అలాంటి పవన్ సినిమాలు వదిలేస్తున్నాడంటే అభిమానులకు నిరాశే. కానీ ప్రజలకు సేవ చేసేందుకు, జనాల తరఫున ప్రశ్నించేందుకు ఆయన పార్టీని స్థాపించి, దానిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం కోసం సినిమాలు వదిలేస్తున్నారని తెలుసుకోవాలని కొందరు అభిమానులు గుర్తు చేస్తున్నారు.

 సమస్యలపై దృష్టి

సమస్యలపై దృష్టి

అజ్ఞాతవాసి సినిమా పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ జనసేన బలోపేతం, తెలుగు రాష్ట్రాల్లోని సమస్యల పైన మరింత దృష్టి సారించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదికి పైగా మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో జనసేన బలోపేతం కోసం త్వరలో కార్యకర్తలతో భేటీ కానున్నారు.

 అన్ని పార్టీలు బీ రెడీ

అన్ని పార్టీలు బీ రెడీ

పవన్ కళ్యాణ్ తాజా సినిమా పూర్తయిన నేపథ్యంలో ఆయన పూర్తిస్థాయి రాజకీయాలప దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలు అప్రమత్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే తమ పరిస్థితి ఏమిటనే విషయమై లెక్కలు వేసుకుంటున్నాయి. నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నించే పవన్ రంగంలోకి దిగుతున్నారని, ఇక అన్ని పార్టీలు బీ రెడీ అంటున్నారు.

 ఆయా నియోజకవర్గాల్లో జనసేన బలంపై ఆరా

ఆయా నియోజకవర్గాల్లో జనసేన బలంపై ఆరా

ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఓ విధంగా జనసేన అంటే పవన్ కళ్యాణ్ అభిమాన గణమే. ఈ లెక్కన చూస్తే చాలా నియోజకవర్గాల్లో జనసేన బలం బాగానే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వంటి పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో జనసేన బలంపై ఆరా తీస్తున్నారట.

 పవన్ కళ్యాణ్ వీటిపై దృష్టి సారించాలి

పవన్ కళ్యాణ్ వీటిపై దృష్టి సారించాలి

పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన బలోపేతం, పార్టీ నడవడం కోసం డబ్బుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అభిమానులను చూసుకొని బలం అనుకుంటే అది వాపు మాత్రమే అవుతుందని అంటున్నారు. అంటే మంచి చేయాలనే ఆలోచనలకు అభిమానుల బలం మాత్రమే సరిపోదు. ప్రజా బలం కూడా కావాలి. అది పవన్‌కు కూడా తెలుసు. కాబట్టి ఆయన జనసేన బలోపేతంపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనకు బలం ఎక్కడ అని, ఆయన షూటింగ్ గ్యాపులో వస్తారని విమర్శించే వారి నోళ్లకు త్వరలో మూత వేస్తారని అంటున్నారు. అలాగే జనసేన నడవాలంటే పార్టీకి ఫండ్ కూడా చాలా అవసరం. ఈ విషయంలో ఆయన ఏం చేస్తారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఎవరిని దెబ్బతీస్తారో

ఎవరిని దెబ్బతీస్తారో

పవన్ కళ్యాణ్ రంగంలోకి ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గతంలో ఆయన టీడీపీకీ మద్దతిచ్చారని, దీంతో చాలామంది ఆ పార్టీకి ఓటేశారని, ఇప్పుడు ఆయన సొంతగా ముందుకెళ్తే టీడీపీకే నష్టమని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా జగన్ విఫలమయ్యాడని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలా చూస్తే జగన్‌కు కోత పడుతుందనే వారు కూడా లేకపోలేదు.

పవన్ కళ్యాణ్ ఆయుధం ఏమిటి

పవన్ కళ్యాణ్ ఆయుధం ఏమిటి

పవన్ కళ్యాణ్‌కు టీడీపీ, వైసీపీ, బీజేపీలపై మంచి ఆయుధాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రత్యేక హోదాతో బీజేపీ, టీడీపీలను నిలదీసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అలాగే ప్రజా సమస్యలపై టీడీపీని, పదేపదే అధికారం అంటూ మాట్లాడటం కాకుండా ప్రజా సమస్యలపై నిలదీసే చిత్తశుద్ధి వైసీపీకి లేదని ప్రశ్నించే అవకాశాలున్నాయి. అన్నింటికి మించి ప్రజా సమస్యలపై ఆయన చిత్తశుద్ధితో స్పందిస్తున్నారని బీజేపీ, టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతుండటం కొసమెరుపు.

English summary
After Agnyaathavaasi movies audio released, Now Jana Sena chief Pawan Kalyan will concentrate on party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X