బియాస్ ట్రాజెడీ: మృతులకు కన్నీటి వీడ్కోలు (పిక్చర్స్)
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో దుర్మరణంపాలైన నలుగురు విద్యార్థుల్లో ఆకుల విజేత, రాంబాబు, ఐశ్వర్య అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక విమానంలో తరలించిన మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. వీరిలో నల్లగొండ జిల్లా మోతె మండలం భీక్యాతండాకు చెందిన రాంబాబు మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున నాలుగింటికి స్వగ్రామానికి తరలించారు.
భారీ సంఖ్యలు గ్రామస్థులు వారి ఇంటికి తరలివచ్చి రాంబాబుకు అశ్రునివాళులు అర్పించారు. ఉదయం 11 గంటలకు భీక్యా తండాలోని వారి సొంత పొలం వద్ద రాంబాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆకుల విజేత అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగాయి. ఆమె అంతిమయాత్రకు బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి సూర్యకుమార్ ఆమె చితికి నిప్పంటించారు.
ఓల్డ్ అల్వాల్‌లోని జ్యోతినగర్‌కు చెందిన ఐశ్వర్య మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో ఊరేగించి గోల్నాక అల్వాల్ మీదుగా స్వర్గధామ్ శ్మశానవాటికకు తరలించారు. అక్కడ ఐశ్వర్య పార్ధీవ దేహంపై ఆమె స్నేహితులు, బంధువులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీకి చెందిన లక్ష్మీగాయత్రి అంత్యక్రియలు వెంకటరమణనగర్ శ్మశానవాటికలో జరిగాయి.

దేవషీస్ మృతదేహం ఇలా..
మంగళవారం బియాస్ నదిలో లభించిన విద్యార్థి దేవశీష్ మృతదేహాన్ని హైదరాబాదుకు తరలించారు.

దేవషీస్ మృతదేహం వద్ద...
దేవషీస్ శవపేటిక వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు విషాదం ముప్పిరిగొనగా ఇలా కనిపించారు.

దేవశీష్ మృతదేహానికి నివాళులు
బియాస్ ప్రమాదంలో మరణించిన దేవషీస్ మృతదేహానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.

విషాద సముద్రంలో..
దేవషీస్ మృతదేహాన్ని చూసి, తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా ఇలా విలపిస్తున్నారు. ఈ దృశ్యం ఇలా..

గంపల ఐశ్వర్య అంత్యక్రియాలు
బియాస్ నదీ ప్రమాదంలో మరణించిన విద్యార్థిని గంపల ఐశ్వర్య మృతదేహానికి ఆల్వాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

కుటుంబ సభ్యుల రోదన...
బియాస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తమ ఐశ్వర్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

లక్ష్మీ గాయత్రి అంత్యక్రియలు
బియాస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లక్ష్మీ గాయత్రి హైదరాబాదులోని కూకట్‌పల్లికి చెందింది. ఆమె అంత్యక్రియలు వెంకటరమణ శ్మశానవాటికలో జరిగాయి.
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications