వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిటిడి చైర్మన్ పదవిపై బాబు హామీ: అనూహ్యంగా తెరపైకి ఆ పేరు

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రేసులోకి అనూహ్యంగా ఓ పేరు తెరపైకి వచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేత బీద మస్తాన్ రావును టిటిడి చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రేసులోకి అనూహ్యంగా ఓ పేరు తెరపైకి వచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేత బీద మస్తాన్ రావును టిటిడి చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు నేతల నుంచి చైర్మన్ పదవికి సంబంధించి అభ్యర్థి విషయంలో గత కొన్ని రోజులుగా చర్చిస్తున్నారు. చివరకు బీద పేరును తెరపైకి తెచ్చారని సమాచారం.

అభిప్రాయ సేకరణ చేస్తే..

అభిప్రాయ సేకరణ చేస్తే..

పార్టీలోనే ఉంటూ, కష్టాకాలంలోనూ జిల్లాలో పార్టీని నడిపించిన వ్యక్తికి ఉన్నతమైన పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. ఆయనకు పదవి ఇచ్చే విషయంలో జిల్లా నేతలతోను మాట్లాడారు. అందరు సానుకూలంగా స్పందించారు.

పార్టీలోనే ఉంటూ..

పార్టీలోనే ఉంటూ..

దీంతో మస్తాన్ రావును చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారని తెలుస్తోంది. టిడిపి ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమానికి ఆకర్షితులై పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలోనే ఉన్నారు.

Recommended Video

Chandrababu Naidu Is Better Than KCR! | Oneindia Telugu
టిడిపిలోకి ఇలా..

టిడిపిలోకి ఇలా..

మొదట బోగోలు జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందారు. అనంతరం అల్లూరు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. పార్టీని నమ్ముకొని పని చేస్తుండటంతో పార్టీ జిల్లా అధ్యక్షునిగా బీద రవిచంద్రను మరోసారి కొనసాగించారు. జిల్లాలో వివిధ వర్గాలతో సమన్వయంతో పనిచేయటమే బీద కుటుంబానికి కలిసొచ్చింది.

కేబినెట్లోకి రవిచంద్ర అని ప్రచారం కానీ

కేబినెట్లోకి రవిచంద్ర అని ప్రచారం కానీ

ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో అనూహ్యంగా బీద రవిచంద్ర పేరు తెరపైకి వచ్చింది. కొన్ని సర్దుబాట్ల నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అవకాశం కల్పించారు.

చంద్రబాబు అప్పుడే హామీ

చంద్రబాబు అప్పుడే హామీ

అప్పుడే పార్టీ తరఫున కీలకమైన పదవి ఇస్తామన్న హామీ చంద్రబాబు నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా బీదా మస్తాన్ రావుకు టిటిడి ఛైర్మన్‌ పదవి లభించే అవకాశముందంటున్నారు.

English summary
It is said that Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu may choose Beeda Masthan Rao for Tirumala Tirupati Devastanam Chairman post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X