వందలు కాదు .. వేలు కాదు ..! యాచకుడి బ్యాగులో భారీ నగదు ..?

అనంతపురం : అతనో యాచకుడు. నలుగురి వద్ద చేయిచాపి భిక్షాటన చేశాడు. అయితే అతనికి కుటుంబం లేదు. నా అనేవాళ్లు కూడా లేరు. తాను కష్టపడి పొగుచేసిన సొమ్మును తన బ్యాగులో భద్రంగా దాచుకున్నాడు. అయితే విధి కన్నెర్ర చేసింది. అనారోగ్యంతో ఆ బిచ్చగాడు చనిపోయాడు. కానీ అతని బ్యాగులో కొత్త బట్టలతోపాటు భారీగా నగదు ఉండటంతో స్థానికులతోపాటు పోలీసులు కూడా నోరెళ్లబెట్టారు.

లక్షాధికారి ...

లక్షాధికారి ...

పక్క ఫోటోలో కనిపిస్తోన్న యాచకుడి పేరు షేక్ బషీర్. అనంతపురం జిల్లా గుంతకల్లు మస్తానయ్య దర్గాలో దాదాపు 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నాడు. అతనికి ఎవరూ లేకపోవడంతో యాచిస్తూ .. జీవిస్తున్నాడు. కుటుంబసభ్యులే కాదు .. నా అనేవాళ్లు కూడా లేరు. దీంతో నలుగురి వద్ద యాచించి కాలం వెళ్లదీశాడు. ఇంతవరకు ఓకే .. కానీ ఆ అనామకుడిపై విధి కన్నెర్ర చేసింది. అనారోగ్యంతో రెండురోజుల క్రితం చనిపోయాడు. అతని చనిపోయాడని తెలిసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 సంచిలో నోట్ల కట్టలు

సంచిలో నోట్ల కట్టలు

మృతదేహంతోపాటు అతని సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఏమీ ఉందని తెరిచి చూసి .. ఆశ్చర్యపోయారు. అందులో కొత్తబట్టలు ఉన్నాయి. దాంతోపాటు నోట్ల కట్టలు కనిపించడంలో పోలీసులు, అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఆ నగదు లెక్కించగా రూ.3 లక్షలకు పైగా ఉంది. రూ.3 లక్షల 23 వేల 217 ఉన్నట్టు గుర్తించారు. అయితే బషీర్ వద్ద డబ్బులు ఉండటంతో అందులోంచి రూ.13 వేలను తీశారు. మిగిలిన నగదును ట్రెజరీలో జమ చేస్తామని పోలీసులు తెలిపారు.

 రియల్ లైఫ్

రియల్ లైఫ్

కమల్ హాసన్ పుష్పక విమానంలో యాచకుడు, ఇటీవల వచ్చిన మంచు లక్ష్మి సినిమాలో బిచ్చగాడు కూడా ఇలానే డబ్బు కూడబెడతాడు. మంచు లక్ష్మి నటించిన సినిమాలో బిచ్చగాడు ఇళ్లు కొనుక్కునేందుకు రూ.10 లక్షలు జమచేస్తాడు. బషీర్ కూడా రూ. 3 లక్షలు జమచేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే తనకు అనారోగ్యం వాటిల్లితే అందుల్లోంచి డబ్బును కూడా తీసుకోకుండా .. తగ్గుతుందేమోనని అతను భావించి ఉంటాడు. ఒకవేళ నగదు తీసి వైద్యం చేయించుకుంటే బతికేవాడని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాను రూ.లక్షలు కూడబెట్టి .. ఆరోగ్యం బాగోలేకుంటే కనీసం వైద్యుడిని సంప్రదించకుండా ఉండి .. చేజేతులా ప్రాణాలు కోల్పోయాడు బషీర్. లేదంటే మరికొన్నిరోజులు బతికేవాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+