వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీ వ్యూహం ఇదీ: జగన్ లెక్క, జాగ్రత్తపడాలని పార్టీ నేతలకు హెచ్చరిక

రాజమహేంద్రవరం: ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు వెనుక పెద్ద వ్యూహమే ఉందా, వచ్చే ఏడాది ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా?

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు వెనుక పెద్ద వ్యూహమే ఉందా, వచ్చే ఏడాది ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవుననే అంటున్నారు.

మోడీ రద్దు వెనుక.. జగన్ ఆలోచన

మోడీ రద్దు వెనుక.. జగన్ ఆలోచన

వచ్చే ఏడాది ఎన్నికలు రావొచ్చునని, ఒక దేశం... ఒక ఎన్నిక నినాదం, పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాల వెనుక ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన అదే కావొచ్చునని వైయస్ జగన్ పార్టీ నాయకుల సమావేశంలో వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

యూపీ ఎన్నికల వాయిదాతో.

యూపీ ఎన్నికల వాయిదాతో.

ఉత్తరప్రదేశ్‌లో మార్చిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడవచ్చునని కూడా అన్నారు. వాటి ఆధారంగా దేశవ్యాప్త ఎన్నికలకు ఒకేసారి వెళ్లే అవకాశం ఉండవచ్చునని, అందువల్ల అందరూ సిద్ధం కావాలని జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేశారని తెలుస్తోంది.

గడపగడపకూ వెళ్లాలని ఆదేశం

గడపగడపకూ వెళ్లాలని ఆదేశం

గడప గడపకు వైసిపి కార్యక్రమంపై జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులతో ఆయన వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇవి మంగళవారం ముగిశాయి. నెలలో 16 రోజులు ఖచ్చితంగా నియోజకవర్గాల్లో తిరగాల్సిందేనని, ప్రజల్లో ఉండాల్సిందేనని సూచించారు. అందరూ కష్టించి పని చేయాలన్నారు.

మరోసారి వారికి పిలుపు

మరోసారి వారికి పిలుపు

కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకు ఉన్న సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్షలకు రాని నేతలను ఈ నెల 12 లేదా 17న మరోసారి పిలిచి సమీక్షిస్తానని జగన్‌ జిల్లాల నేతలకు స్పష్టం చేశారు.

English summary
YSRCP chief YS Jaganmohan Reddy analysed on PM Narendra Modi's demonetisation decesion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X