ఎవరికి ఎంత మెజారిటీ, ఎవరిది గెలుపు?, రూ. కోట్లలో బెట్టింగ్, కోడి పందెలు, ఐపీఎల్ కు పోటీ!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల పోలింగ్ జరిగింది. సోమవారం రాత్రి కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుండటంతో పలు ప్రాంతాల్లోని నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో మాదే అధికారం అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అలాగే అధికార వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఒకే విడతలో, ఒకే రోజు 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు, 25 లోక్ సభ నియోజక వర్గాలక పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో గతంలో కంటే ఈ రోజు జరిగిన పోలింగ్ లో ఎక్కువ శాతం మంది ఓట్లు వెయ్యడంతో ఎన్నికల అధికారులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో కంటే ఎక్కువ ఆసక్తి చూపించడంతో ఇటు రాజకీయ నాయకులు హ్యాపీగానే ఉన్నారని తెలిసింది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 25 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎవరు గెలుస్తారు ? అంటూ బెట్టంగ్ లు మొదలైనాయి. పలు పోలింగ్ కేంద్రాల దగ్గరే గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల బెట్టింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, నాయకులే బెట్టింగ్ లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు జోరుగా బెట్టింగ్ లు పాల్పడ్డారని తెలిసింది.
ఎక్కువగా టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వారివారి స్థాయిని బట్టి బెట్టింగ్ లు కట్టారని తెలిసింది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, పీలేరు, తంబళపల్లె, మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, నగిరిలో జోరుగా బెట్టింగ్ జరిగిందని తెలిసింది. కడప జిల్లాలో కూడా జోరుగా బెట్టింగ్ జరిగిందని సమాచారం. మా నాయకుడు గెలుస్తాడు అంటే లేదు మా లీడర్ గెలుస్తారు అంటూ వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు బెట్టింగ్ లు కట్టారని ప్రచారం జరుగుతోంది.
పలు నియోజక వర్గాల్లో వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు బెట్టింగ్ లకు కట్టారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బైక్ లు బెట్టింగ్ కట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇక కోస్తా జిల్లాల్లో అయితే కోడి పందెలను తలపించేలా జోరుగా బెట్టింగ్ లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల బెట్టింగ్ లకు పోటీగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో జోరుగా బెట్టింగ్ లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
మొత్తం మీద అనధికారికంగా కోట్లాది రూపాయలు బెట్టింగ్ లు జరుగుతున్నాయని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తదితరులు ఎంత మెజారిటీ సాధిస్తారు అని కూడా బెట్టింగ్ జరిగిందని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో ఇంత భారీగా బెట్టింగ్ లు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications