ఏపి ఎన్నిక‌ల పై కాయ్ రాజా కాయ్‌: హాట్ సీట్లు ఏంటంటే..: బాల‌కృష్ణ‌..నాగ‌బాబు పోటీ పై ఫోక‌స్...!

Recommended Video

    AP Assembly Election 2019 : ఏపి ఎన్నిక‌ల పై కాయ్ రాజా కాయ్‌ || Oneindia Telugu

    ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పై బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు కాస్తున్నారు. ల‌క్ష‌ల్లో పందేలు కుదుర్చుకుంటున్నా రు. సీటు..అభ్య‌ర్ది ఆధారంగా పందెం రేటు ఫిక్స్ అవుతోంది. ప్ర‌ధానంగా హాట్ సీట్లు గా డిసైడ్ అయిన వాటి పై ఎక్కువ గా పందేలు కాస్తున్నారు.ఇక‌, నాగ‌బాబు..బాల‌కృష్ణ గెలుపు మీదా జోరుగా పందేలు సాగుతున్నాయి.

    ఎన్నిక‌ల్లో గెలిచేదెవ‌రు..

    ఎన్నిక‌ల్లో గెలిచేదెవ‌రు..

    ఏపి ఎన్నిక‌ల్లో పోలింగ్ కు ఇంకా 10 రోజులు ఉంది. అయితే అప్పుడే ఏపి తో పాటుగా తెలంగాణ లోనూ ఏపి ఎన్నిక‌ల ఫ‌లితాల పై పందేలు కాస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావ‌టంతో పాటుగా ఎక్క‌డ ఏ అభ్య‌ర్ది గెలుస్తార‌నే దాని పై పందేలు ఎక్కువ‌గా క‌డుతున్నారు. ఇదేదో ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం కాలేదు. ఏపిలోని హాట్ సీట్ల గురించి పందెం కాసిన సొమ్ముకు రెండు నుండి ప‌ది రెట్లు వ‌ర‌కు ఎక్కువ‌గా ఆఫ‌ర్ చేస్తున్నారు. ఇక‌, అధికారంలోకి టిడిపి అని కొంద‌రు...వైసిపి అని మ‌రి కొంద‌రు త‌మ‌కు ఉన్న స‌మాచారం ఆధారంగా పందేలు కాస్తున్నారు. అది లక్ష‌ల్లో కొన‌సాగు తోంది. ఫ‌లితాలు మే 23న ఉన్నా..ముందే త‌మ రేట్ల‌తో ఫిక్స్ అయిపోతున్నారు.

     హాట్ సీట్ల పై ఎక్కువ‌గా..

    హాట్ సీట్ల పై ఎక్కువ‌గా..

    ఏపిలో ప్ర‌ముఖులు పోటీ చేస్తున్న స్థానాల పై ఎక్కువ‌గా బెట్టింగ్ జ‌రుగుతున్నట్లుగా చెబుతున్నారు. అందులో ప్ర‌ధా నంగా చంద్ర‌బాబు త‌న‌యుడు పోటీ చేస్తున్న మంగ‌ళ‌గిరి సీటు పై ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది. అదే విధంగా కొడాలి నాని గెలుపు పై గుడివాడ సీటు గురించి పందేలు కాస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీలో ఉన్న గాజువా..భీమ‌వ‌రం నియోజ క‌వ‌ర్గాల పై గెలుపు..అదే విధంగా మెజార్టీ గురించి కూడా అప్పుడే పందెం రాయుళ్లు ఎక్కువ‌గా పందేలు కాస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక‌, స‌త్తెన‌ప‌ల్లి..పులివెందుల‌..జ‌మ్మ‌ల‌మడుగు వంటి సీట్ల పైనా ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. హోరా హోరీ పోరు ఉన్న సీట్ల పైనే వీరు పందేలు కాస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక, టిడిపి..వైసిపి సాధించే లోక్‌స‌భ సీట్ల పైనా పెద్ద ఎత్తున పందేలు కాస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒక వైపు ఐపిఎల్ న‌డుస్తుంటే...ఈ సారి దానిని మించిన పందేలు ఏపి లోని హాట్ సీట్ల పై జ‌రుగుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

    ప‌వ‌న్‌..బాల‌కృష్ణ‌..నాగబాబు అవ‌కాశాల పై..

    ప‌వ‌న్‌..బాల‌కృష్ణ‌..నాగబాబు అవ‌కాశాల పై..

    ఈ పందేలు కాసే వారిలో వివిధ రంగాల వారు ఉన్న‌ట్లు చెబుతున్నారు. అందులో ప్ర‌ధానంగా సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు త‌మ రంగం నుండి రాజ‌కీయాల్లోకి వెళ్లి ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బ‌డిన వారి పైనే ఎక్కువ‌గా పందేలు కాస్తున్న ట్లు స‌మాచారం. బాల‌కృష్ణ హిందూపూర్ అసెంబ్లీ అభ్య‌ర్దిగా పోటీ చేస్తున్నారు. అక్క‌డ ఆయ‌న గెలుపు ఓట‌మ‌లు పై పందేలు ఎక్కువ‌గా కాస్తున్నారు. ఇక‌, నాగబాబు న‌ర్సాపురం ఎంపీ అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. ఆయ‌న గెలుపు అవ‌కాశా ల మీదా సినీ ఇండస్ట్రీలోని బెట్టింగ్ రాయుళ్లు దృష్టి సారించారు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ బ‌రిలో ఉన్న స్థానాల‌తో పాటుగా పార్టీ మొత్తంగా గెలుచుకొనే సీట్ల పై వీరు ప్ర‌ధానంగా ఫోక‌స్ చేస్తున్నారు. దీంతో..పాటుగా కొంద‌రు ముందుగానే అడ్వా న్స్‌లు తీసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. విశాఖ ఎంపి సీటుతో పాటుగా విజ‌య‌వాడ స్థానం పైనా ఎక్కువ‌గా పందేలు సాగుతున్నట్లు చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+