Graveyard: స్మశానంలో ఏపీ మంత్రి .. ఆయన చేసిన పని చూస్తే షాక్..!
ఏపీ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతోంది. ఎన్నో ఆశలతో రెండేళ్ల క్రితం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నా కొందరు ప్రజా ప్రతినిధులు మాత్రం తమదైన పనితీరుతో ప్రజల్ని ముఖ్యంగా తమకు ఓటేసిన ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇదే కోవలో ఓ రాష్ట్ర కేబినెట్ మంత్రి (AP minister) కూడా తన నియోజకవర్గంలో అరుదైన శ్రమదానం నిర్వహించారు. అదీ శ్మశానంలో (graveyard). దీంతో ఆ మంత్రి చేసిన శ్మశాన శ్రమదానం వార్తల్లో నిలుస్తోంది.
మంత్రి స్ధాయిలో ఉన్న రాజకీయ నాయకుడంటే.. కాన్వాయ్ తో తిరుగుతుంటారు, ఎక్కడికెళ్లినా చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. చొక్కా నలగకుండా, కాలు కదపకుండా ఏపనైనా చేయించుకోగల సత్తా ఉంటుంది. కానీ ఏపీలో ఓ మంత్రిని చూస్తే.. ఈయనేం మంత్రిరా బాబూ... అని అనకుండా ఉండలేం. పాలకొల్లు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం జలవనరుల మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు (nimmala ramanaidu) మాత్రం పొలంలో దిగి నాట్లు వేస్తారు, భవననిర్మాణ కార్మికుడిగా శ్లాబ్ లు వేయిస్తారు, ఇటుకలు మోస్తారు, మట్టి పని చేస్తారు, రోడ్డు వేస్తుంటే తనే దగ్గరుండి పనులు చేస్తారు, డ్రైవర్ లేకపోతే ఆయనే అంబులెన్స్ నడుపుతారు, రోగుల్ని ఆస్పత్రికి తీసుకెళ్తారు. ప్రజలు ఏ కష్టంలో ఉన్నా... నేనున్నాను... మీకేం కాదని భరోసా ఇస్తారు.

ఇదే క్రమంలో తాజాగా మహాశివరాత్రి సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. తన నియోజకవర్గం పాలకొల్లు పరిధిలోని గ్రామాల్లోని స్మశాన వాటికలను శ్రమదానం ద్వారా శుభ్రం చేశారు. 6 గ్రామాల్లో శ్మశానవాటికల అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరయ్యాయి. యలమంచిలి, ఆగర్తిపాలెం, పూలపల్లి గ్రామాల్లో ఆయా పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అగర్తిపాలెం శ్మశానవాటిక ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగి, వ్యర్థాలు పేరుకుపోయినట్లు గుర్తించిన మంత్రి.. వాటిని తొలగించే పని చేపట్టారు. స్థానికులు కూడా ఆయన్ను అనుసరించారు. మానవ సేవే మాధవసేవగా భావించి శివరాత్రి రోజున శ్మశానవాటికను శుభ్రం చేసిన మంత్రి నిమ్మల రాయానాయుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.












Click it and Unblock the Notifications