పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీకి శుభవార్త వినిపించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే శుభవార్త వినిపించింది. భారత్ గౌరవ్ టూరిస్టు రైలు రాష్ట్రం మీదగా నడవబోతోంది. నేపాల్, ముక్తినాథ్, దివ్యదేశం యాత్రకు ప్రత్యేక ప్యాకేజీతో ఈ రైలును నడుపుతున్నారు. జూన్ 7వ తేదీన చెన్నైలో బయలుదేరుతుంది. తిరిగి జూన్ 19వ తేదీన తిరుగు ప్రయాణమవుతుంది. భారత్ గౌరవ్ రైలు విజయవాడ డివిజన్ పరిధిలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, ఖాజీపేట స్టేషన్ల మీదగా ప్రయాణిస్తుంది. అలాగే ముక్తినాథ్, ఖాట్మండ్, నైమిశారణ్యం, అయోధ్య, పశుపతినాథ్ కూడా వెళుతుంది.
అన్నింటికీ కలిపే టికెట్లు
ఈ రైలులో ప్రయాణించాలనుకునే భక్తులకు ఛార్జీల వివరాలను కూడా అధికారులు తెలిపారు. స్లీపర్ లో రూ.45,900, థర్డ్ ఏసీలో రూ.54,900, సెకండ్ ఏసీలో 59,950గా నిర్ణయించారు. టీ, టిఫిన్, భోజనం, హోటల్ గదులు, రవాణాతో కలిపే వీటిని వసూలు చేస్తున్నారు. ఇతర వివరాలకు 93550 21516 నెంబరులో సంప్రదించాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.

అత్యాధునిక సౌకర్యాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే తనను తాను మార్చుకుంటూ ప్రయాణికులకు అత్యాధునిక వసతులున్న రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. కాలక్రమంలో మరిన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్ల రూపురేఖలను మారుస్తున్నారు. వందే భారత్ పేరుతో సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తేగా, మరికొద్ది రోజుల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా రానున్నాయి. వీటిల్లో ఛార్జీలు ఎక్కువ అని ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి నాన్ ఏసీ బోగీలతో అమృత్ భారత్ రైళ్లను రైల్వే ప్రవేశపెట్టింది. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లను పునరుద్ధరిస్తున్నారు.












Click it and Unblock the Notifications