• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వివేకా హత్య కేసులో మరో మలుపు : అల్లుడితో గొడవలు - హత్య వెనుకా : సీబీఐకి భరత్ లేఖ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి..సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే సీబీఐ ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా చార్జిషీట్‌లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిలను నిందితులుగా పేర్కొనగా.. నాలుగు రోజుల కిందట దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఇక, ఇప్పుడు వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఒక పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న భరత్‌యాదవ్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు.

వివేకా హత్య కేసులో తెర మీదకు కొత్త వాదన

వివేకా హత్య కేసులో తెర మీదకు కొత్త వాదన

ఈ వివరాలన్నింటితో కూడిన లేఖను ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్‌కూ పంపుతున్నట్లు తెలిపారు. ఆ వివరాలతోనే సీబీఐకి లేఖ రాసారు. అందులో పేర్కొన్న అంశాల మేరకు.. హత్యకు సంబంధించిన విషయాలను సీబీఐ దృష్టికి తెచ్చింది తానేనన్నారు. వివేకా, తన తాత గోర్ల చెంచురెడ్డితో చాలా సన్నిహితంగా ఉండేవారని పేర్కొన్నారు. ఇటీవల తన తాత మరణించాక తాను వివేకానందరెడ్డితో అప్పుడప్పుడు కలిసేవాడినని..తన స్థల వివాదం విషయమై 2019 జనవరిలో ఆయన్ను పలుమార్లు కలిసి వివరించానని చెప్పుకొచ్చారు.

భరత్ యాదవ్ సీబీఐకు లేఖ

భరత్ యాదవ్ సీబీఐకు లేఖ

ఆ తర్వాత ఆయన పీఏగా చెప్పుకుంటూ తిరుగుతున్న సునీల్‌యాదవ్‌ను కలిసి తన సమస్యను వివేకా దృష్టికి తీసుకెళ్లాలని కోరానన్నారు. తాను 25రోజుల తరువాత సునీల్‌యాదవ్‌ ఇంటికి వచ్చాక అతనిని చూడటానికి వెళ్లానని... సునీల్‌యాదవ్‌ నడవలేని పరిస్థితిలో గాయాలతో ఉన్నాడని... పోలీసులకు ఒక్క మాట కూడా చెప్పకుండా బయటకు వచ్చానన్నాడని పేర్కొన్నారు. ఎందుకంటే.. డబ్బుకోసం ప్రాణాలకు తెగించి ఇదంతా చేశామని చెప్పినట్లుగా వివరించారు. ప్రతీసారి నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి పేర్లు వాడుతుండడంతో వివేకా హత్య వెనుక వీరున్నారని తనకు పూర్తిగా అర్ధమైందని పేర్కొన్నారు.

అల్లుడితో గొడవలు..ఆర్దికంగా వివాదాలు

అల్లుడితో గొడవలు..ఆర్దికంగా వివాదాలు

ఎందుకు ఈ పనిచేశారని సునీల్‌యాదవ్‌ను అడిగితే.. వివేకా మాకు చాలా అన్యాయం చేశారని.. బయటనుండి ఏదో డబ్బు వస్తే మా వాటా ఇవ్వనని అనడంతో ఈ పనిచేశామని చెప్పాడు. ఎర్ర గంగిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలతో ఒప్పందం కుదుర్చుకుని ఈ పనిచేశామన్నాడని చెప్పుకొచ్చారు. నేను డబ్బులు అడుగుతున్న ప్రతిసారీ వివేకానే చంపాం.. నిన్ను కూడా క్షణంలో చంపుతామని హెచ్చరిస్తూ రెండుసార్లు నాపై హత్యాయత్నానికి ప్రయత్నించాడని వివరించారు.

సునీల్ యాదవ్ చెప్పాడంటున్న భరత్

సునీల్ యాదవ్ చెప్పాడంటున్న భరత్

వివేకా హత్యకు ప్రధాన కారణం డబ్బులు, సెక్స్‌ అని కూడా సునీల్‌యాదవ్‌ చెప్పాడు. ప్రతి పనికీ మమ్మల్ని వాడుకుని డబ్బులు వచ్చిన తరువాత అందులో సగం పూర్తిగా తన సన్నిహితురాలైన షమీమ్‌కు ఇవ్వాలని వివేకా చెప్పేవారన్నాడు. వివేకా తన ఆస్తులను షమీమ్‌కు బదలాయిస్తున్నారనే విషయంపై నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వివేకా తరచూ గొడవ పడేవారని సునీల్‌యాదవ్‌ చెప్పేవాడు. ఇలా వివేకా హత్యకు కుటుంబ, ఆస్తి తగాదాలు కారణమని.. ఈ విషయం ఎర్ర గంగిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జీర్ణించుకోలేక ఈ పనిచేసినట్లు సునీల్‌యాదవ్‌ చెప్పాడని పేర్కొన్నారు.

  YS Jagan's Bail - Shocking Turn |Raghu Rama Krishnam Raju | CBI Court | Oneindia Telugu
  కొత్త కోణంతో వాస్తవాల పైన చర్చ

  కొత్త కోణంతో వాస్తవాల పైన చర్చ


  చివరికి.. తన డబ్బులు ఇవ్వకుండా తనను కూడా చంపుతామని చాలాసార్లు బెదిరించాడన్నారు. సునీతమ్మకు ఇవన్నీ చెప్పాలని ప్రయత్నించినా తనను కలవడానికి అవకాశమివ్వలేదు. సునీల్‌యాదవ్‌ గురించి పూర్తిగా తెలుసుకుని సీబీఐ వారికి విన్నవించానని పేర్కొన్నారు. ఇప్పుడు భరత్ సీబీఐకి రాసిన లేఖలోని అంశాలు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. ఇందులో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయనే అంశం సైతం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

  English summary
  New elements are coming to the fore in the Viveka murder case. Recently Bharat Yadav revealed new facts in this case
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X