రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేయడంలో భాగంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా చిత్తశుద్ధితో పనిచేస్తామని అన్నారు. గత రెండు రోజులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

కొత్తూరు కరివెన రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత పాలనలో సాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకమైన భూసేకరణ ప్రక్రియను పక్కనపెట్టి, యంత్రాలు, పంపులకే నిధులు వెచ్చించారని ఆరోపించారు. పాలమూరు, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, జూరాల వంటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే ఇప్పటికే 26 లక్షల ఎకరాలకు నీరు అందేదని ఆయన అభిప్రాయపడ్డారు.

CM Revanth Reddy Unveils Plan to Irrigate 26 Lakh Acres erstwhile Mahabubnagar accelerated Projects

గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రూ. 84,503 కోట్ల అప్పు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 నెలల్లోనే రూ. 52,121 కోట్లను అప్పులు, వడ్డీల కింద చెల్లించిందని వివరించారు. కొత్తగా రూ. 22,000 కోట్లు ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయగా, అందులో రూ. 8,000 కోట్లు ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులకే కేటాయించామని తెలిపారు. భారీగా నిధులు వెచ్చించినా, క్షేత్రస్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదో గత ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

రాబోయే రెండేండ్లలో ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయడమే లక్ష్యమని, దీనికోసం మరో 4,000 ఎకరాల భూ సేకరణ అవసరమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతులు ఆశిస్తున్న ధర కంటే కొంత ఎక్కువ ఇచ్చేందుకైనా సిద్ధపడి, భూసేకరణను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2027 నాటికి పంపులు, లిఫ్టులు, కెనాల్ పనులన్నింటినీ పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని, ఆగిపోయిన రిజర్వాయర్ల పనులను కూడా పునరుద్ధరించి, నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కర్ణాటక సరిహద్దులో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణంతో భూగర్భ జలాల పెంపునకు అవకాశం ఉందని, త్వరలోనే సాంకేతిక నిపుణులతో చర్చించి పొరుగు రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 968 టీఎంసీల వాటా విషయంలో అస్సలు రాజీపడే ప్రసక్తే లేదని, ప్రతి చుక్కను వ్యూహాత్మకంగా కాపాడుతామని పునరుద్ఘాటించారు. పొరుగు రాష్ట్రాలతో అనవసర వివాదాలకు తావులేకుండా, చర్చల ద్వారానే పరిష్కారం కోరుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కృష్ణా జలాల సమస్యలను కూడా డిసెంబర్ నాటికి పరిష్కరించుకుంటామని, మహారాష్ట్రతో చర్చల ద్వారా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, కేంద్రం కూడా మద్దతు ధరతో ధాన్యం సేకరించాలని కోరారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఉత్పత్తి అయ్యే యూరియాను తెలంగాణ అవసరాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి తీరతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+