కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!

బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇవాళ ప్రకటించారు. ఇందులో ఏపీకి చెందిన పురందేశ్వరితో పాటు 13 మంది ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. అలాగే జాతీయ కార్యవర్గంలో పలు మార్పులు జరిగాయి. ఇందులో భాగంగా బీజేపీకి చెందిన ఓ కీలక నేతపై వేటు పడింది. దీని వెనుక కారణం కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలే అని తెలుస్తోంది. వీటికి కౌంటర్ ఇవ్వడంలో వైఫల్యమే ఆయనపై వేటుకు కారణమై ఉండొచ్చని సమాచారం.

బీజేపీ తరఫున సోషల్ మీడియాలో ప్రత్యర్దులపై రెచ్చిపోయే ఐటీ సెల్, సోషల్ మీడియా సెల్ ఛీఫ్ అమిత్ మాలవీయ (Amit Malviya) పై ఇవాళ అనూహ్యంగా వేటు పడింది. 2015 నుంచి బీజేపీకి చెందిన రెండు కీలక విభాగాలకు ఆయన బాస్ గా వ్యవహరిస్తున్నారు. మోడీ-అమిత్ షా రాజకీయ ప్రత్యర్దులైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష పార్టీల నాయకుల్ని ఓ రేంజ్ లో టార్గెట్ చేసిన మాలవీయకు ఇవాళ ప్రకటించిన కొత్త కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఆయన స్ధానంలో ఛత్తీస్ ఘడ్ కు చెందిన దీపక్ మస్కేను (Deepak Mhaskey) బీజేపీ నియమించింది.

Amit Malviya Removed as BJP IT Cell Chief Over Failure to Counter Student Protests Sources

దీపక్ మస్కేకు ఎన్నికల డేటా విశ్లేషణ, సంస్థాగత నిర్వహణ, క్షేత్రస్థాయి రాజకీయాలలో అనుభవం ఉంది. దీన్ని బట్టి చూస్తే, డేటా ఆధారిత ఎన్నికల వ్యూహం మరియు సంస్థాగత విస్తరణపై బీజేపీ మరింత దృష్టి సారించాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమిత్ మాలవీయను ఐటీ సెల్, సోషల్ మీడియా సెల్ ఛీఫ్ పదవుల నుంచి తప్పించడం వెనుక బీజేపీ పెద్దల్లో ఆయనపై ఉన్న అసంతృప్తి కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న మొన్న పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ రెచ్చిపోతుంటే.. దాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక సతమతం కావడం అమిత్ మాలవీయపై వేటుకు కారణంగా తెలుస్తోంది. జెన్ జీతూ నిండిన కాక్రోచ్ జనతా పార్టీకి యువత సోషల్ మీడియాలో అండగా నిలుస్తుంటే, దాన్ని ఎలా కౌంటర్ చేయాలో మాలవీయకు అర్దం కాలేదు. దీంతో కేంద్రానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+