సైలెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్.. నువ్ మామూలోడివి కాదన్నా..!

చిన్న హీరో అయినా.. పెద్ద హీరో అయినా ఈ రోజుల్లో హిట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్ద హీరోల సినిమాల కంటే కంటెంట్ తో వస్తున్న చిన్న హీరోల సినిమాలకే ఇప్పటి జెన్ జీ యువత జై కొడుతున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో హిట్ కోసం పరితపిస్తున్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. వరుణ్ తేజ్ కు గతకొంతకాలంగా హిట్ లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన మట్కా మూవీ డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది. అలాగే అంతకుముందు వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్, గాంఢీవధారి అర్జున సినిమాలు సైతం ప్లాఫ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మెగా హీరోకు సరైన హిట్ లేక చాలా ఏళ్లు అవుతోంది.

ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం 'కొరియన్ కనకరాజు' ఈ మూవీ ఆగస్టు 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సూపర్ హిట్ కలెక్షన్స్ తో థియేటర్ల వద్ద రఫ్పాడిస్తోంది. హార్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ మూవీని మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

VarunTej Mega Prince Varun Tej s movie Korean Kanakaraju quietly rakes in 50 crore Varun Tej

చాలా ఏళ్ల తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో సరైన హిట్ పడిన నేపథ్యంలో అటు మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వరుణ్ తేజ్ కు ఇది కెరీర్ బెస్ట్ కమ్ బ్యాక్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొరియన్ కనకరాజు మూవీలో వరుణ్ తేజ్‌ టైమింగ్, కామెడీ యాంగిల్‌ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ, సంగీత దర్శకుడు ఎస్ తమన్ అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం వరుణ్ తేజ్ బరి అనే సినిమా చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్లు సినిమాతో నేషనల్ అవార్డు దక్కించుకున్న దర్శకుడు ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బరి మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+