తెలంగాణలో SIR ఓటర్ డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్.. మీ ఓటును ఇలా చెక్ చేసుకోండి..!

తెలంగాణలో SIR డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల అయింది. సమగ్ర సవరణ ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామని తెలిపారు. నోటీసులు అందుకున్నవారు సమాధానం ఇచ్చేందుకు సెప్టెంబర్ 16 గడువు ఉంటుందని స్పష్టం చేశారు. 73 లక్షల మంది ఏఎస్‌ డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్) లిస్ట్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో 3.38 కోట్లకు పైగా ఓటర్ల ఉండగా.. ఇప్పటివరకు 78.30 శాతం అంటే 2.64 కోట్ల మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించారు. మరో 57.46 లక్షల మంది అడ్రస్ మారడం.. లేదా అందుబాటులో లేకపోవడంతో వారి వివరాలు పెండింగ్ లో పడ్డాయి. మీ పేరు జాబితాలో ఉందో..? లేదో..? చెక్ చేసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్​ రెడ్డి తెలిపారు. ఓటరు పేరు లిస్టులో లేకపోతే సెప్టెంబర్ 16 వరకు ఫామ్-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు సర్ లో సరైన వివరాలు ఇవ్వని దాదాపు 92 లక్షల మందికి నోటీసులు అందనున్నాయి.

SIR Draft list Released now Draft Voter List Released in Telangana Here s How to Check Your Vote

SIR ఓటర్ డ్రాఫ్ట్ రిలీజ్ కు ముందు సీఈఓ సుదర్శన్ రెడ్డి పలు రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సర్ ప్రక్రియలో తదుపరి కార్యాచరణపై పలు విధాలుగా చర్చలు నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్​, ఎంఐఎంతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు హాజరయ్యారు. సర్​ ప్రక్రియలో పార్టీలు చేపట్టాల్సిన తదుపరి కార్యచరణపై సుదర్శన్​ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. ఇక ఈరోజు నుంచి సెప్టెంబర్ 17 వరకు నెల రోజుల పాటు ఓటర్ల వివరణలు, అభ్యంతరాలు, క్లెయిమ్‌ లనూ స్వీకరించనున్నారు. అక్టోబర్ 19వ తేదీన తుది ఓటరు జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. మీ ఓటును అధికారిక ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో ధ్రువీకరించుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+