"భీమ్లా" వివాదం వెనుక - అసలు ట్విస్టు అక్కడే: పవన్ వారిని నమ్మి..!!

పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ విడుదలైంది. విడుదలతో పాటుగాగా రాజకీయంగానూ ఏపీలో ఈ సినిమా వివాదానికి కారణమవుతోంది. ఏపీలో సినీ సమస్యలు మొత్తం పరిష్కారం అయినట్లే..అని అగ్ర హీరోలు చెప్పినా..భీమ్లాకు మాత్రం సమస్యలు తప్పటం లేదు. అయితే, సమస్యల పరిష్కారంతో పాటుగా పరిశ్రమ సమస్యలపైన సానుకూలంగా స్పందించినా..భీమ్లా విషయంలో మాత్రం ప్రభుత్వ యంత్రాగం చేస్తున్న హడావుడి ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన భీమ్లానాయక్ కరోనా కారణంగా ఇతర సినిమాలతో పాటుగా వాయిదా పడింది. ఆ తరువాత సినీ నిర్మాతలు చర్చించుకొని ఒక్కో సినిమా ఎప్పుడు విడుదల చేయాలనే దాని పైన వరుసగా డేట్స్ అనౌన్స్ చేసారు.

తొలుత సందేహించినా..ఆ తరువాత

తొలుత సందేహించినా..ఆ తరువాత

అందులో భాగంగా..తొలుత ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 అంటూ రెండు డేట్స్ ప్రకటించారు. ఏపీలో సినీ టికెట్ల పైన చర్చలు సాగుతున్నాయి..వాటి పైన నిర్ణయం వెలువడిన తరువాత ఫైనల్ డేట్ ఫిక్స్ చేయాలని భావించారు. అనుకున్న విధంగానే చిరంజీవి అండ్ టీం సీఎం జగన్ తో చర్చలు జరిపారు. సీఎం జగన్ టికెట్ ధరలు అటు సామాన్యులకు భారం కాకుండా..ఇటు ఇండస్ట్రీకి నష్టం లేకుండా పెంచేందుకు అంగీకరించారు. అదే సమయంలో ఇండస్ట్రీ సమస్యలతో పాటుగా అయిదో షో విషయంలోనూ సానుకూలంగా స్పందించారు. దీంతో..చర్చల్లో పాల్గొన్న హీరోలు వరుసగా సీఎం జగన్ కు థాంక్స్ చెప్పారు. ఇక, ఈ చర్చలు ముగిసిన తరువాత ప్రభుత్వం నుంచి ఈ నెల మూడో వారంలోగా అధికారికంగా నిర్ణయాలు అమలయ్యేలా జీవోలు ఇస్తారని చర్చల్లో పాల్గొన్న వారు ధీమాగా చెప్పారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయంలో మార్ప వస్తుందనే..

ఏపీ ప్రభుత్వ నిర్ణయంలో మార్ప వస్తుందనే..


ఇక, ప్రభుత్వం సినిమా టికెట్ అంశాలు..ఆన్ లైన్ టికెట్లు..థియేటర్ల వ్యవహారం పైన నియమించిన కమిటీ ఈ నెల 16న సమావేశం అయింది. అందులో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. వారం లోగా ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. కానీ, అప్పటికే 25న భీమ్లానాయక్ సినిమా విడుదల డేట్ ఫిక్స్ అయింది. సహజంగా పవన్ సినిమా అనగానే కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయనే అంచనాలతో ఉన్న బయ్యర్లు సైతం ఈ రోజునే (25వ తేదీ)న సినిమా విడుదలకు ఒత్తిడి తెచ్చారు. 25వ తేదీ లోగా ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త జీవో వస్తుందని భీమ్లా నాయక్ నిర్మాతలు అంచనా వేసారు. కానీ, అక్కడే అంచనాలు తప్పాయి. ఆ సినిమా విడుదలకు ఇబ్బందులు లేకుండా ముందుగానే ఉత్తర్వులు లేదా మినహాయింపులు ఇవ్వాలని ఆ సమావేశంలో ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరలేదు.

పాత ధరలే అమలు చేయాలంటూ

పాత ధరలే అమలు చేయాలంటూ

ఇక, ఇదే సమయంలో సినిమా విడుదలకు రెండు మూడు రోజుల ముందు నుంచే రెవిన్యూ అధికారులు థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. అప్పటికే ఉన్న జీవో అమల్లో ఉంటుందని..బెనిఫిట్ షో లకు అనుమతి లేదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, కొత్త జీవో వచ్చే వరకూ పాత జీవో అమల్లో ఉంటుంది. కానీ , కొందరు అధికారుల అత్సుత్సాహం తో నోటీసులు ఇవ్వటం వివాదానికి కారణమైంది. దీంతో..చివరి నిమిషంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంత్రులు కేటీఆర్..తలసానిని ఆహ్వానించారు. ఆ సమయంలో తెలంగాణలో అయిదో షోకు అనుమతి వచ్చింది. ఇది కొంత రిలీఫ్ ఇచ్చింది. ఇక, ఏపీలో బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వలేదు. దీంతో..అనేకమంది అభిమానులు అటు తెలంగాణ...యానం కు వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి చూపారు.

Recommended Video

    Bheemla Nayak: Pawan Kalyan కోసం ఫ్యాన్స్ హంగామా| Bheemla Nayak Review
    కొత్త జీవో విడుదల ఆలస్యంతో..

    కొత్త జీవో విడుదల ఆలస్యంతో..

    ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కాకున్నా..మరి కొద్ది రోజులకు అయినా కొత్త ధరల జీవో ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ వి మరిన్ని కొత్త సినిమాలు సిద్దం అవుతున్నాయి. అయితే, ఈ సినిమా విషయంలో మాత్రం ప్రభుత్వ కమిటీతో చర్చలు జరిపిన పెద్దలు... భీమ్లా విడుదల లోగా జీవో తెప్పించేలా ఒత్తిడి చేయలేకపోయారు. ఖచ్చితంగా సినిమా విడుదలకు కొత్త ధరలు వస్తాయనే నమ్మకంతో...చాలా వేగంగా సినిమా విడుదలకు కావాల్సిన పనులు పూర్తి చేసారు. కానీ, ఏపీలో బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వకపోవటం మాత్రం పవన్ అభిమానులకు రుచించటం లేదు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ విమర్శలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే పవన్ సినిమాలను టార్గెట్ చేస్తోందనే వాదన మొదలైంది. ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పుడు ఈ విమర్శల పైన ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+