భోళాశంకర్ నిర్మాతను చూసి పండగ చేసుకుంటున్న స్టార్ ప్రొడ్యూసర్?
ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి కథానాయకుడిగా అనిల్ సుంకర 'భోళాశంకర్' చిత్రాన్ని నిర్మించారు. దీనికి దర్శకుడు మెహర్ రమేష్ . రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫలితంపై, దర్శకుడిపై అన్యాపదేశంగా చర్చ సాగుతోంది. అనిల్ సుంకర్ అక్కినేని అఖిల్ తో చేసిన 'ఏజెంట్' సినిమావల్ల రూ.55 కోట్లు, భోళాశంకర్ చిత్రంతో రూ.60 కోట్లు నష్టపోయారు.
రెండు సినిమాలకు కలిపి రూ.115 కోట్లు నష్టపోవడంతోపాటు శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా, డిస్ట్రిబ్యూటర్ గా ఆధిపత్యం చెలాయించే ఓ అగ్ర నిర్మాత అనిల్ సుంకర ప్రస్తుత పరిస్థితిని చూసి మంచి ఖుషీగా ఉన్నాడని, పండగ చేసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ నిర్మాతకు అగ్ర హీరోలెవరూ కాల్షీట్లు ఇవ్వడంలేదు. ఆయన కంటే ముందుగా మైత్రీ మూవీ మేకర్స్, అనిల్ సుంకర హీరోలకు అడ్వాన్స్ లిచ్చేస్తున్నారు. వీరిద్దరూ కాకుంటే మారో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్స్ లోకి ఎంటరైన మైత్రీమూవీ మేకర్స్ కు, ఈయనకు సత్సంబంధాలు లేవు. బయటకు కనపడని యుద్ధం జరుగుతోంది.
ఉత్తరాంధ్రలో ఈ నిర్మాతకు ప్రధాన పోటీదారుగా ఉన్న 'గాయత్రి సతీష్' ఏజెంట్ సినిమా దెబ్బకు కుదేలయ్యారు. దీంతో అక్కడ పోటీలేకుండా పోయింది. అలాగే నైజాంలో వరంగల్ శీను కూడా దెబ్బతినడంతో ఆయనకు ఎదురు లేకుండా పోయిందని సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాలమీద రూ.115 కోట్లు నష్టపోయిన అనిల్ సుంకర్ ఇకనుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయలేడని సదరు నిర్మాత ఆనందంతో గెంతులేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications