ఇక్కడే ఆనందం: పంట పొలాల్లో నాట్లు వేసిన అఖిలప్రియ దంపతులు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలయప్రియ తన భర్త భార్గవరామ్‌తో కలిసి వరినాట్లు వేశారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామ సమీపంలో ఉన్న పాములేటి అనే రైతు పొలంలో ఈ నవదంపతులు నాట్లు వేశారు.
ఈ సందర్భంగా కూలీలతో ముచ్చటిస్తూ.. మంచిచెడ్డలు తెలుసుకున్నారు. ఎంత కూలీ ఇస్తున్నారంటూ ఆరా తీశారు. పొలాల్లో సరదాగా గడిపిన ఫొటోలను అఖిలప్రియ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

ప్రజల మధ్య ఉన్నప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా అఖిలప్రియ చెప్పారు. రైతులు, కూలీలతో మాట్లాడానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు మంత్రి అఖిలప్రియ తెలిపారు. కాగా, ఆగస్టు 29న అఖిలప్రియ, భార్గవ్‌ల వివాహం జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications