ఘనంగా మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం: వరుడు ఎవరో తెలుసా?
Recommended Video

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి అఖిలప్రియ నిశ్చితార్థం పారిశ్రామికవేత్త భార్గవ్‌తో శనివారం ఆమె నివాసంలో ఘనంగా జరిగింది. ఆమె కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

కుటుంబసభ్యుల మధ్య..
మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడే ఈ భార్గవ్.సాంబశివరావు కుమార్తెతో ఇటీవలే విడాకులు తీసుకున్నట్లు సమాచారం. మంత్రి నారాయణకు కూడా భార్గవ్ బంధువేనని తెలిసింది. కాగా, భార్గవ్, అఖిలప్రియ మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు తెలిసింది.

ప్రేమ వివాహమే
ఈ నేపథ్యంలోనే వీరి నిశ్చితార్థం అఖిలప్రియ, భార్గవ్ కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో జరిగింది. కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరి వివాహం ఆగస్టు 29న జరగనుంది.

అనూహ్యంగా రాజకీయాల్లోకి..
తన తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలను కోల్పోయిన అఖిలప్రియ అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత మంత్రి పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఆమె పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

సవాళ్లను ఎదుర్కొంటూ..
రాజకీయపరంగా సవాళ్లు ఎదురవుతున్నా.. తల్లిదండ్రుల్లానే ధైర్యంగా రాజకీయ వ్యవహారాలను అఖిలప్రియ చక్కబెడుతున్నారు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రజలే తన కుటుంబసభ్యులని చెబుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, అఖిలకు ఇప్పటికే వివాహం జరిగినప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో విడిపోయారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications