వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పాను లేకుండా చేయాలి: అఖిలప్రియ, రంగంలోకి జలీల్ ఖాన్!

నంద్యాల ప్రజలు తమ ఓటుతో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాలలోనే కాదు.. ఏకంగా జిల్లాలోనే లేకుండా చేయాలని మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ అన్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ప్రజలు తమ ఓటుతో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాలలోనే కాదు.. ఏకంగా జిల్లాలోనే లేకుండా చేయాలని మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ అన్నారు.

నంద్యాల ఉపఎన్నికలు: గెలుపుపై టిడిపికి అనుమానాలున్నాయా?నంద్యాల ఉపఎన్నికలు: గెలుపుపై టిడిపికి అనుమానాలున్నాయా?

మరో యాభై ఏళ్ల వరకు నంద్యాల ప్రజలు అభివృద్ధి అడగకుండా ప్రగతి చేసి చూపించారని, సీఎం చంద్రబాబుకు మనం టిడిపి అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి కానుకగా ఇద్దామన్నారు.

అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేస్తారు

అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేస్తారు

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అప్పుడు ఏం అభివృద్ధి చేశారని, ఇప్పుడు ఓటేస్తే ఏం పొడుస్తారని సీఎం చంద్రబాబు, మంత్రి అఖిలప్రియ అన్నారు. మంత్రిగా ఉంటేనే చేయలేని వ్యక్తి ఇప్పుడు గెలిచి మా ప్రభుత్వంలో ఏం చేస్తారన్నారు.

శిల్పాకు కావాల్సింది అవే

శిల్పాకు కావాల్సింది అవే

మూడేళ్లు టిడిపిలో నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి పనులు అడగలేదని, ఆయనకు డబ్బులు, వ్యాపారాలు, ప్లాట్లు కావాలని, అధికారాన్ని అమ్ముకుంటారని, మార్కెట్ యార్డులోని స్థలాన్ని చవకగా కొట్టేసి, పెద్ద సేవ చేస్తున్నట్లు పోజుకొడుతున్నారని టిడిపి మండిపడింది.

జగన్‌కు శిల్పా సహకారం

జగన్‌కు శిల్పా సహకారం

పేదలకు ఇళ్లు కట్టమంటే హౌజింగ్ బోర్డు భూమిని అందుకిచ్చి, లాభాలు తీసుకున్న వ్యక్తిగా జగన్‌ ఏ1 ముద్దాయిగా ఉన్నారని, దీనికి శిల్పా సహకారం అందించారని టిడిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము జలవనరుల శాఖ భూమినిచ్చి ఇళ్లు కట్టిస్తుంటే వారు భూములను ఆక్రమించుకున్నారన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సీటు ఇద్దామంటే కాదని, ఇంకా మోసం చేయడానికి వైసిపిలో చేరారన్నారు.

ఎవరి ప్రయత్నాలు వారివి

ఎవరి ప్రయత్నాలు వారివి

నంద్యాల నియోజకవర్గంలో ముస్లీం మైనార్టీల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు టిడిపి, వైసిపిలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.

ముస్లీం ఓటర్లను ఆకట్టుకునేందుకు రంగంలోకి జలీల్ ఖాన్

ముస్లీం ఓటర్లను ఆకట్టుకునేందుకు రంగంలోకి జలీల్ ఖాన్

టిడిపి ముస్లీం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను రంగంలోకి దించింది. సోషల్ మీడియాలో బికాంలో ఫిజిక్స్ కామెంట్‌తో జలీల్ ఖాన్ పేరు జనాల్లో బాగా నానింది. ఆయన నంద్యాల నియోజకవర్గంలో టిడిపి తరఫున ప్రచారం చేస్తారు.

English summary
Tourism Minister Bhuma Akhila Priya lashed out at the Opposition parties for making personal attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X