Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా తండ్రిని వేధిస్తే: భూమా అరెస్ట్‌పై అఖిల ప్రియ హెచ్చరిక

హైదరాబాద్: తన తండ్రి భూమా నాగిరెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందని, అలా చేస్తే తన తండ్రి ఇంకా ఎదుగుతారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. భూమా నాగిరెడ్డి లాంటి వారినే ఇబ్బంది పెడుతున్నామనే సందేశం తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

పోలింగ్ పరిసరాల్లోంచి మహిళా ఎమ్మెల్యేను వెళ్లిపోమని ఎలా అడుగుతారని మాత్రమే తన తండ్రి ప్రశ్నించారని, కించపరిచే వ్యాఖ్యలు చేయలేదన్నారు. సండ్ర వెంకట వీరయ్య పైన కేసు ఉన్నప్పటికీ ఆయనను రాజమండ్రి ఆసుపత్రికి పంపిన టీడీపీ నేతలు, తన తండ్రి ఓఫెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తి అని తెలిసినా నిమ్స్‌కు తరలించడాన్ని వివాదాస్పదం చేస్తున్నారన్నారు.

Bhuma Akhila Priya warns TDP government

తన తండ్రి జైలులో నిరాహార దీక్ష చేపట్టారన్నారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. తాను ఓటేయడానికి వెళ్లినప్పుడు పోలీసులు అడ్డుకున్నారన్నారు. దానిని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనక్కి తగ్గమన్నారు.

ప్రభుత్వం తన తండ్రిని అణగదొక్కాలని చూస్తోందన్నారు. తాము ఏమాత్రం తగ్గమన్నారు. ఒక పథకం ప్రకారం తన తండ్రిని కేసులో ఇరికించారన్నారు. తన హక్కులకు భంగం కలిగినందుకే తన తండ్రి పోలీసులను నిలదీశారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+