పెళ్లికి తప్పక రావాలి: చిరుకు అఖిలప్రియ ఆహ్వానం, ‘సైరా’ అభినందన, జోరుగా వివాహ ఏర్పాట్లు
హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం కలిశారు. నగరంలోని ఆయన నివాసానికి తన కుటుంబసభ్యులతో వెళ్లిన అఖిలప్రియ.. తన వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. తన వివాహానికి తప్పకుండా హాజరుకావాలని ఆహ్వానించారు.

చిరంజీవికి ఆహ్వానం
అఖిలప్రియతోపాటు ఆమె సోదరి మౌనిక, ఆమె భర్త గణేష్ రెడ్డి, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా ఉన్నారు. చిరంజీవిని ఆహ్వానించిన విషయాన్ని అఖిలప్రియ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
చిరుకు అభినందనలు
ఈ సందర్భంగా చిరంజీవికి ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రను పోషిస్తున్న చిరుకు అభినందనలు తెలిపారు.

సైరా భారీ హిట్ అవ్వాలంటూ..
‘సైరా నర్సింహారెడ్డి' సినిమా ఘన విజయం సాధించాలని మంత్రి అఖిలప్రియ ఆకాంక్షించారు. ఆగస్టు 29న అఖిలప్రియ వివాహం పారిశ్రామికవేత్త భార్గవ్ రామ్‌తో జరగనున్న విషయం తెలిసిందే.

పెళ్లి ఏర్పాట్లు చకచకా
మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కూడా అఖిలప్రియ, భార్గవ్ రామ్‌లు తమ వివాహానికి ఆహానించారు. కాగా, ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వీరి వివాహానికి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications