భూమా 'రాజకీయం': విశ్లేషకులకు పనిపెట్టిన మంచు మనోజ్
దివంగత భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికను మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ కు, మౌనికకు ఇద్దరికీ ఇది ద్వితీయ వివాహమే. వివాహమైన తర్వాత మౌనిక రాజకీయాల్లోకి వెళతానంటే మద్దతిస్తానని మనోజ్ వ్యాఖ్యానించారు. దీంతో భూమా కుటుంబం నుంచి మరొకరి రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమవుతోందని స్పష్టమైంది.

అఖిలప్రియకు సీటివ్వాలా? వద్దా?
మౌనిక సోదరి అఖిలప్రియ గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మంత్రి పదవిని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అలాగే సోదరుడు బ్రహ్మానందరెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. వీరిద్దరూ ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి పోటీచేశారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీచేయడానికి తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని అఖిలప్రియ చంద్రబాబును కోరుతున్నారు. మరోవైపు బ్రహ్మానందరెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారు. తనకు రెండో వివాహమైన తర్వాత మూడున్నర సంవత్సరాల నుంచి వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నానుతోన్న అఖిలప్రియకు వచ్చే ఎన్నికల్లో సీటివ్వాలా? వద్దా? అనే సందేహంలో చంద్రబాబు ఉన్నారు. తనకు సీటు విషయమే సందిగ్ధంలో ఉంటే... తమ్ముడికి కూడా నంద్యాల కేటాయించాలని కోరుతుండటాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

చంద్రగిరిపై రాని స్పష్టత
తన భర్త మద్దతుతో మౌనికారెడ్డి పోటీచేస్తారని అర్థమవుతోంది. మంచు, భూమా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటంతో ఈ విషయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ అఖిలప్రియకు పోటీవస్తారా? రారా? అనే విషయంలో స్పష్టత రావడంలేదు. వాస్తవానికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీచేయడానికి సిద్ధమయ్యారు. అయితే గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ పోటీచేస్తారంటూ వార్తలు రావడంతో వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్థత కొనసాగుతోంది.

మళ్లీ సినిమాల్లో నటిస్తోన్న మనోజ్
వివాహమైన తర్వాత తాను మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని మనోజ్ ఒక స్పష్టతనిచ్చారు. దీంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టడంలేదని అర్థమైంది. అయితే తన భార్య మౌనిక రాజకీయరంగ ప్రవేశానికి తాను మద్దతిస్తానని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మౌనిక పోటీచేస్తారా? సీటు అడుగుతారా? పోటీచేస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో మౌనిక దేన్ని ఎంచుకుంటారు? అందుకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి అనుమతి ఉందా? లేదా? అనే విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. అఖిలప్రియకు, సోదరి మౌనికకకు పొసగడంలేదనే సంగతి తెలిసిందే. మౌనిక ఆళ్లగడ్డ నుంచి పోటీచేయానలుకుంటోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మనోజ్-మౌనిక పెళ్లిలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అట్రాక్షన్ గా నిలిచారు. బీఆర్ఎస్ తరఫున పోటీచేసే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వీరి రాజకీయ నావ చివరకు ఏ తీరానికి చేరుతుందో చూడాలి.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications