Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అరెస్ట్ చేస్తే రంగంలోకి దిగుతా: బాబుకు భూమన హెచ్చరిక, 'జగన్‌పై కుట్ర'

గుంటూరు: తుని విధ్వంసం ఘటన విషయమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని అధికారులు మంగళవారం నాడు ప్రశ్నిస్తున్నారు. గతంలో రెండు రోజులు ఆయనను ప్రశ్నించారు. తాజాగా, మరోసారి ఆయనను ప్రశ్నిస్తున్నారు.

నన్ను అరెస్టు చేస్తే.. భూమన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడవటం వెన్నతో పెట్టిన అని భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు హాజరయ్యే ముందు ఆరోపించారు. చంద్రబాబు పాలన బకాసురుడి పాలన మాదిరిగా ఉందన్నారు. కుట్రలు, కుతంత్రాల చేయడం బాబుకు కూనిరాగం తీసినంత సులువన్నారు.

ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకు ఏదో ఒక నెపాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. తుని ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒకవేళ ఆ ఘటన పేరుతో తనను అరెస్టు చేస్తే ప్రత్యక్షంగా కాపు ఉద్యమంలో పాల్గొంటానని హెచ్చరించారు.

Bhumana Karunakar Reddy challenges AP CM Chandrababu

ఎవరో దుండగులు రైలును దగ్ధం చేస్తే ఆ ఘటనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. ముద్రగడ పద్మనాభం పోరాటానికి తమ నాయకుడు వైయస్ నైతిక మద్దతు ఇచ్చినందుకే తమను వేధిస్తున్నారన్నారు.

దానిని తెలుగుదేశం ప్రభుత్వం భరించలేకపోతోందన్నారు. తమ పార్టీని వేధించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు లాంటి అరాచక శక్తి మరొకటి లేదన్నారు. ఇచ్చిన వాగ్ధానం మరిచిపోవడం, వాగ్ధానం అంటే నిన్నటు పలుకులా మార్చడం చంద్రబాబుకు తేలిక అన్నారు. భారత రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి రాక్షసుడు లేడన్నారు. అలాంటి రాజకీయ రాక్షసుడి చేతిలో ఏపీ ఉండం దురదృష్టమన్నారు.

జగన్‌ను విధ్వంసకారుడిగా చిత్రీకరించే కుట్ర: అంబటి

తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని విధ్వంసకారుడిగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసిపి నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఈ నెల 6, 7 తేదీల్లో జ‌రిగిన‌ సీఐడీ విచార‌ణ వివ‌రాలు ఓ ప‌త్రికలో వ‌చ్చాయని అంబ‌టి ఆరోపించారు. గోప్యంగా జ‌రిగిన విచార‌ణ వివ‌రాలు బ‌య‌టికెలావ‌చ్చాయని ప్ర‌శ్నించారు. తుని విధ్వంసం కేసులో భూమ‌న‌ను ప్ర‌భుత్వం అక్ర‌మంగా ఇరికించాల‌ని చూస్తోందని చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆరోపించారు. తమ నేత‌ని కేసులో ఇరికిస్తే చూస్తూ ఊరుకోబోమ‌న్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+