"బాబు పెద్ద నల్లకుబేరుడు.. తెహల్కా 12 ఏళ్ల క్రితమే బయటపెట్టింది"
తిరుపతి : ఏపీ సీఎం చంద్రబాబుపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. గురువారం తిరుపతిలో మీడియా మాట్లాడిన సందర్బంగా.. అవినీతిలో చంద్రబాబు పెద్ద నల్ల కుబేరుడు అని అభివర్ణించారు. రూ.1000 నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు చెబుతోన్న మాటలను ఎద్దేవా చేస్తూ.. చంద్రబాబు ఆ మాటలనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు భూమన.
చంద్రబాబు వద్ద ఉన్న నోట్ల కట్టలను కాలిస్తే గనుక ఓ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయోచ్చునని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అవినీతిలో చంద్రబాబు ఎంతటి సామ్రాట్ అనేది 12 ఏళ్ల క్రితం తెహల్కా డాట్ కామ్ బయటపెట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు గనుక చంద్రబాబు అనుచరుల ఇళ్ల మీద ఐటీ దాడులు చేస్తే లక్షల కోట్ల రూపాయల నల్లధనం బయటపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో అవినీతికి పెట్టింది పేరు చంద్రబాబేనని దుయ్యబట్టారు.













Click it and Unblock the Notifications