భూమన రాజకీయ సన్యాసం: మంత్రి పదవి రాదని తేలిపోయిందా: అంత చిన్న విషయం కాదు..!
వైసీపీ సీనియర్ నేత..తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇక తాను పోటీ చేయనని ప్రకటించారు. నాడు వైయస్‌కు..నేడు జగన్‌కు భూమన విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో తిరుపతి నుండి ఓడిన భూమన తాజా ఎన్నికల్లో గెలుపొందారు. అయితే, జగన్ కేబినెట్‌లో భూమను మంత్రి గా అవకాశం ఉందా లేదా అనే స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో తిరుపతిలో ఆత్మీయ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
వైయస్ కుటుంబానికి విధేయుడిగా..
భూమన కరుణాకర రెడ్డి వైయస్ కుటుంబానికి వీర విధేయుడు. నాడు వైయస్ పాదయాత్ర నుండి ఆయనకు మరింతగా దగ్గరయ్యారు. వైయస్ తొలి సారిగా 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సైతం తన పక్కనే అవకాశం కల్పించారు. వైయస్ హయాంలో కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించారు. అనేక ఆరోపణలు వచ్చినా..వాటిని పట్టించుకోకుండా భూమనకు ఆ పదవి కట్టబెట్టారు. ఆయన తన సామర్ధ్యం ఏంటో టీటీడీ చైర్మన్‌గా నిరూపించుకున్నారు. ఇక, తన పదవీ కాలం ముగిసినా..వైయస్ విధేయుడిగానే ఉంటూ..2009 ఎన్నికల్లో తిరిగి వైయస్ అధికారంలోకి రావటం కోసం పని చేసిన కోర్ టీం సభ్యుడుగా వ్యవహరించారు. తిరిగి వైయస్ అధికారం లోకి రావటంతో..భూమనకు మరోసారి అవకాశం వస్తుందని భావించారు. అయితే, 2009 ఎన్నికల్లో భూమన తిరుపతి నుండి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చేతిలో పరాజయం పాలయ్యారు.

ఎమ్మెల్యేగా ఇదే చివరి సారి..
తిరుపతిలో జరిగిన ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్యే భూమన కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు. కేబినెట్‌లో మంత్రి పదవి అవకాశాలపై స్పందిస్తూ.. తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం మంత్రి పదవి కంటే గొప్ప విషయమని చెప్పారు. తిరుపతిలో టీడీపీపై గెలవడమంటే అంత చిన్న విషయం కాదని, తన గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పనిచేస్తున్నారని భూమన కితాబిచ్చారు. అయితే, సమీకరణాల్లో భాగంగా భూమనకు మంత్రిగా అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో..ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నట్లుగా ఎక్కడా చెప్పటం లేదు. అదే సమయంలో తిరుపతికి ఉన్న ప్రాధాన్యత వివరిస్తూ..అక్కడ ఎమ్మెల్యేగా ఉండటాన్ని గొప్ప విషయంగా చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు భూమన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. దీని పైన ఎటువంటి స్పందనలు వస్తాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications