గోవా తరహాలో విశాఖలో బీచ్ లవ్: ఛీ! ఇదేమిటని బాబుపై ఊగిపోయిన భూమన

చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు విదేశీ సంస్కృతి పిచ్చి పట్టుకుందని ఆగ్రహించారు.

ప్రేమికుల దినోత్సవం నాడు విశాఖపట్నం సముద్రతీరంలో డిస్కో డ్యాన్సులు నిర్వహించాలని యోచిస్తుండటం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. తెలుగువారి మది నిండా ప్రేమ ఉందని, ఇప్పుడు మళ్లీ ప్రేమికుల దినోత్సవం పేరుతో ఆర్భాటాలు అవసరం లేదన్నారు.

కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. గోవా తరహాలో విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవడం సరికాదని అన్నారు. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు బీఎల్ఎఫ్ 2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. దీనిపై పలువురు మండిపడుతున్నారు.

Bhumana lashes out at Chandrababu for BLF 2017

చంద్రబాబు నాయుడు వద్ద ఉన్న నోట్ల కట్టలు కాలిస్తే ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని భూమన ఎద్దేవా చేశారు. రూ.1000 నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

పన్నెండేళ్ల క్రితమే చంద్రబాబు అవినీతి సామ్రాట్ అన్నారు. ఈ విషయాన్ని తెహెల్కా డాట్ కామ్ స్పష్టం చేసిందని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు, ఆయన అనుయాయుల ఇళ్ల పైన ఐటీ దాడులు చేస్తే పెద్ద ఎత్తున డబ్బు దొరుకుతుందన్నారు. అవినీతికి పెట్టింది పేరు చంద్రబాబు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+