చంద్రబాబు భార్య భువనేశ్వరి యాక్టివ్ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సదర్బంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, చంద్రబాబు రాష్ర్ట యువసేన ఆద్వర్యంలో మంగళవారం నారా భువనేశ్వరి వికలాంగులకు ట్రైసైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. వికలాంగులను చిన్న చూపు చూడటం మనలను మనం కించపరుచుకోవటమేనని ఆమె అన్నారు. సామాజిక కార్యక్రమాల ద్వారా నారా భువనేశ్వరి యాక్టివ్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
దేవుని దృష్టి లో మనుషులంతా సమానమేనని, అందుకే వికలాంగుల ను ఆదరణతో, ఆత్మీయతతో దగ్గరకు తీసుకొని, వారికి చేయూతనివ్వాలని తెలిపారు. వికలాంగులలో మనకం టే ఎక్కువ సృజనాత్మక శక్తి ఉంటుందని, వారిని సరైన రీతి లో ప్రోత్సహిస్తే, ఏరంగంలోనైనా అద్బుతంగా రాణించగలరని తెలిపారు. తన తండ్రి ఎన్టీ రామారవు వికలాంగు లకు అన్ని విధాల సౌకర్యాలు కలిగించటానికి కృషి చేశారన్నారు.
అదేబాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ వారిని, వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తున్నారిని భువనేశ్వరి తెలి పారు. వికలాంగుల పట్ల జాలి చూపించే కంటే, వారికి తగిన ఉపాధి కల్పించి, వారు స్వశక్తితో జీవించే విదంగా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని నారా భువనేశ్వరి ప్రజలను కోరారు. అనంతరం 14 ట్రైసైకిళ్ళు, 4 వినికిడి యంత్రాలు, 2 వాకింగ్ స్టిక్స్, 8 బెయిలీ కిట్స్‌ను భువనేశ్వరి వికలాంగులకు పంపిణీ చేశారు.

ఎన్టీఆర్‌కు నివాళి
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

చిన్నారులతో ఇలా..
వికలాంగ బాలలకు సేవా కార్యక్రమాలు అందిస్తూ భువనేశ్వరి ఇలా... పిల్లలకు వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టిక్స్, బెయిలీ కిట్స్, ట్రైసైకిళ్లు ఆమె పంచి పెట్టారు.

ఆనందాన్ని పంచిపెడుతూ...
వికలాంగులైన పిల్లలకు ఆనందాన్ని పంచి పెట్టే కార్యక్రమాన్ని భువనేశ్వరి చేపట్టారు. ఓ పిల్లాడి చేత కేక్ కట్ చేయిస్తూ భువనేశ్వరి ఇలా...

ట్రైసైకిల్ పంపిణీ చేస్తూ...
వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేస్తూ భువనేశ్వరి ఇలా.. ఆమె 14 ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు.

ట్రైసైకిల్ ఇచ్చి ఇలా...
ఓ వికలాంగుడికి ట్రైసైకిల్ అందించి ఇలా దండం పెడుతూ నారా భువనేశ్వరి... ఆమె వినికిడి యంత్రాలను కూడా పంచి పెట్టారు.

కిట్స్ పంచి పెడుతూ..
వికలాంగులైన బాలురకు భువనేశ్వరి బెయిలీ కిట్స్‌ను పంచిపెట్టారు. పిల్లలకు ఇలా సాయం అందిస్తూ భువనేశ్వరి..

వికలాంగులకు సేవలు..
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా భువనేశ్వరి బెయిలీ కిట్స్, వినికిడి యంత్రాలను వికలాంగులకు పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications