హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు భార్యకు ప్రమాదం: వ్యాయామం చేస్తూ పడిపోయిన భువనేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరి ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో భువనేశ్వరి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీంతో భువనేశ్వరి కుడి చేతి మణికట్టుకు ఫ్రాక్చర్‌ అయ్యింది.

ఆ సమయంలో లోకేష్‌ అక్కడే ఉండటంతో భువనేశ్వరిని హుటాహుటిన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో థర్డ్‌ ఫ్లోర్‌లోని ఇంటర్నేషనల్‌ వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్పత్రికి చేరుకుని భువనేశ్వరిని పరామర్శించారు.

Bhuvaneswari injured while doing exercise

బాలకృష్ణ సతీమణి వసుంధర, చంద్రబాబు కోడలు బ్రహ్మణి అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. భువనేశ్వరికి ప్రమాదమేమీ లేదని అపోలో వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగుతున్నాయి. వైద్యులతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu's wife Bhuvaneswari Devi injured while doing exercise in Hyderabad in her residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X