నాగార్జునకు ఎసరు పెట్టిన బాలకృష్ణ?
బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే 6 సీజన్లు పూర్తిచేసుకుంది. ప్రేక్షకులు 7వ సీజన్ ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. తాజాగా సీజన్ 7 ప్రోమోను వదిలారు. దీంట్లో హోస్ట్ ఎవరనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. కేవలం లోగో చూపించారు. ఈ సీజన్ కు నాగార్జున చేయడంలేదని తెలుస్తోంది.
రియాలిటీ షో బిగ్ బాస్ 7 ప్రోమో విడుదలైంది. 7వ సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ ఉండదేమో అని అభిమానులు అనుకుంటున్న తరుణంలోనే ప్రోమో రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. ఫైనల్ జాబితా ను కూడా సిద్ధం చేశారు. జులై ఆఖరు వారం లేదంటే ఆగస్టు మొదటి వారంలో బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

6వ సీజన్ లో నాగార్జున పూర్తి స్థాయిలో మెప్పించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దీనిపై ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. ఆరోసీజన్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. కనీసం టీఆర్పీ రేటింగ్స్ కూడా రాలేదు. దీంతో నాగార్జున బిగ్ బాస్ కు గుడ్ బై చెపుతారని తెలుస్తోంది. ఆరో సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరో కూడా ప్రజలకు చాలామందికి తెలియదు. ఆ విధంగా ఎంపిక జరిగింది. అయితే ఈసారి అటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందరికీ తెలిసినవారినే ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే హోస్ట్ గా బాలకృష్ణ పేరు వినపడుతోంది. అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఆయన బాగా రక్తి కట్టించారు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు బాలయ్యవైపు చూస్తున్నారు. మరోవైపు రానా పేరుకూడా వినపడుతోంది. ఈ నెలాఖరుకల్లా పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications