వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి-బిజెపి: ఏడ్చారు, మెడకు కొంగు బిగించి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిడిపి - బిజెపిల పొత్తు ఇరు పార్టీలలోను రెండు ప్రాంతాల్లో అసంతృప్తి రాజేసింది. రెండు రోజులు గడిచినా అసంతృప్తి సెగలు తగ్గలేదు. పొత్తు వ్యవహారం బిజెపిని ఇరకాటంలోకి నెట్టేసింది. పొత్తు అధికారికంగా ప్రకటించిన నాటి నుంచి పార్టీ సీనియర్లు అసమ్మతి బుసలు కొడుతున్నారు.

ఏయే నియోజకవర్గాలను టిడిపి బిజెపికి కేటాయించిందనే అంశం గోప్యంగా ఉంచడంతో అభ్యర్ధులు నేరుగా రోడ్డుమీదకు వచ్చి తన అభ్యంతరాలను వ్యక్తం చేయకున్నా, వారి అనుచరులు మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

నిరసనలు ఇటు సీమాంధ్ర ప్రాంతంలోనూ అటు తెలంగాణ ప్రాంతంలోనూ రోజురోజుకూ రాజుకోవడం బిజెపి అగ్రనేతలకు మింగుడుపడటం లేదు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

పరిస్థితి పతాకస్థాయికి చేరిందా అన్నట్టు సోమవారం నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన ఒక కార్యకర్త బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో సీనియర్ నాయకులు నచ్చజెప్పారు. పొత్తు ప్రకటన వచ్చింది మొదలు ఆశావాహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

దశాబ్దాల తరబడి తాము పార్టీకి సేవలు చేస్తూ, ఉద్యమాలు నిర్వహిస్తూ, అగ్రనేతల ఆదేశాలు పాటిస్తూ సమయాన్ని, డబ్బును, మానవ వనరులను పెద్దఎత్తున వెచ్చించిన తర్వాత చివరి నిమిషంలో పొత్తుల పేరుతో సీటు ఇవ్వలేమని చెబితే దాన్ని ఎట్లా జీర్ణించుకోగలుగుతామని ప్రశ్నిస్తున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

పార్టీలో వ్యక్తమవుతున్న ఆగ్రహజ్వాలను దృష్టిలో ఉంచుకునే జాతీయ నాయకత్వం అభ్యర్థుల పేర్లను వెల్లడించడం లేదని చెబుతున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

ఈసారి మాత్రం నాయకత్వాన్ని గౌరవించేది లేదని తమను కించపరిచే రీతిలో పార్టీ వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోలేమని బహిరంగంగా వారు విమర్శలకు దిగుతుండగా మరికొందరు తిరుబాటు బావుటా ఎగురవేస్తున్నారు

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

ఇప్పటికే పలు జిల్లాల అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన సంకినేని వెంకటేశ్వర్లుకు సూర్యాపేట శాసనసభ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు గత నాలుగు రోజులుగా హంగామా చేస్తున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

రోజూ వేలాదిమంది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకుని ముట్టడిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం ఒక కార్యకర్త ఆత్మాహత్యకు ప్రయత్నించగా పోలీసులు జోక్యం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

తుంగతుర్తి నియోజకవర్గంలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై తెదేపా తరఫున పోటీ చేసి సంకినేని గెలుపొందారు. తర్వాత డీలిమిటేషన్‌తో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వుకావడంతో సంకినేని ఈసారి సూర్యాపేట నుంచి పోటీ చేయాలని భావించారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

మహాకూటమిలో భాగంగా 2009లో సూర్యాపేట తెరాసకు రిజర్వు కాగా, బి ఫారాన్ని వెనక్కు ఇచ్చిన సంకినేని తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినా ఎక్కువకాలం అక్కడ కొనసాగక, తిరిగి బిజెపికి వచ్చారు. సూర్యాపేట సీటు తనకు తప్పకుండా వస్తుందని భావించినా, పరిస్థితి అందుకు అనుకూలంగా లేకపోవడంతో పార్టీలోనే ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

కొత్తగా పార్టీలో చేరిన వారందరి పరిస్థితి ఇదేరీతిగా ఉండటం గమనార్హం. టిక్కెట్లు ఇవ్వకుంటే ఊరుకునేది లేదని, తాము స్వతంత్య్ర అభ్యర్థులుగానైనా పోటీ చేస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

పొత్తులో భాగంగా తమ స్థానాలను బిజెపికి కేటాయించవద్దని కోరుతూ తెలంగాణ, సీమాంధ్ర ఇరు ప్రాంతాల్లోనూ టిడిపి శ్రేణులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

ఉప్పల్, ఖైరతాబాద్ స్థానాలను బిజెపికి కేటాయించడాన్ని నిరసిస్తూ సోమవారం చంద్రబాబు నివాసం ఎదుట కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

ఉప్పల్ స్థానాన్ని దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్‌కు ఇవ్వకుండా బిజెపికి కేటాయించడం, అలాగే ఖైరతాబాద్ స్థానాన్ని మాజీ మంత్రి విజయరామా రావుకు ఇవ్వకుండా బిజెపికి కేటాయించడాన్ని నిరసిస్తూ టిడిపి కార్యకర్తలు చంద్రబాబు నివాసం ఎదుట ధర్నాకు దిగారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

ఖైరతాబాద్ నియోజకవర్గంకు చెందిన మహిళా కార్యకర్త ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది.

 టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

మల్కాజ్‌గిరి లోకసభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశించిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

తెదేపాకు రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అలాగే నల్గొండ జిల్లాలో తన వర్గానికి చెందిన వారికి కాకుండా మోత్కుపల్లి నర్సింహులు వర్గానికి చెందిన వారికి టిక్కేట్లు దక్కడం పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన ఉమామాధవ రెడ్డికి ఓ దశలో పార్టీకి రాజీనామా చేయాలనుకున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

అనంతపురం అర్బన్ స్థానాన్ని బిజెపి కేటాయించడాన్ని నిరసిస్తూ ఇక్కడి నుంచి టిడిపి టిక్కెట్ ఆశించిన ప్రభాకర్ చౌదరి స్వతంత్రంగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

అలాగే ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశించిన మైనారిటీ నాయకుడు నదీం అహ్మద్ కూడా తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

చివరగా చంద్రబాబుతో మరోసారి చర్చించి బిజెపికి ఈ స్థానాన్ని ఇవ్వవద్దని కోరనున్నట్టు నదీంఅహ్మద్ తన అనుచరులకు చెప్పారని సమాచారం. ఒకవేళ చంద్రబాబు విననిపక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారని తెలిసింది.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

అనంతపురం అర్బన్ స్థానాన్ని బిజెపికి కేటాయించడం వల్ల వైసిపి అభ్యర్థి విజయానికి పరోక్షంగా తోడ్పడుతుందని ఇటీవల టిడిపిలో చేరిన జెసి దివాకర్‌రెడ్డి అభిప్రాయపడినట్టు తెలిసింది.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

కడప జిల్లాలో రాజంపేట లోకసభ, కడప అసెంబ్లీ స్థానాలను బిజెపికి కేటాయించడాన్ని కూడా స్థానిక టిడిపి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

రాజంపేట లోకసభ స్థానం పరిధిలో రెండున్నర లక్షల మంది, కడప అసెంబ్లీ స్థానం పరిధిలో 75 వేలమంది మైనార్టీ ఓటర్లు ఉన్నారని, ఈ రెండింటిని బిజెపికి కేటాయించడం పట్ల మైనార్టీ ఓటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

కడప జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో మైనార్టి ఓటర్లు ఉండటంతో జిల్లాలో బిజెపికి కేటాయించిన స్థానాల వల్ల వారు టిడికి దూరమయ్యే ప్రమాదం ఉందంటున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

బిజెపి - టిడిపి పొత్తుపై గోదావరి జిల్లాలోనూ ప్రకంపనలు వస్తున్నాయి. నర్సాపురం లోకసభ స్థానాన్ని బిజెపికి కేటాయించడాన్ని టిడిపి శ్రేణులు వ్యతిరేకించకపోయినా, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను పొత్తులో వదులుకోవడాన్ని టిడిపి శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

రాజమండ్రి సిటీ స్థానాన్ని బిజెపికి కేటాయించడం వల్ల ఆ పార్టీకి కనీసం డిపాజిటు కూడా దక్కే పరిస్థితి ఉండదని టిడిపి నేతలు సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

గత ఎన్నికలలో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఈలి నాని ఇటీవల టిడిపిలో చేరారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

వీరిద్దరినీ కాదని, ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించడం పట్ల వీరుద్దరూ ఏకమై బిజెపి అభ్యర్థిని ఓడించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

విశాఖపట్నం లోకసభా స్థానానికి వైసిపి నుంచి షర్మిల పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అక్కడ ఆమెకు గట్టి పోటీ ఇవ్వడం కష్టమని భావించిన టిడిపి, ఆ స్థానాన్ని బిజెపికి వదిలిపెట్టాలని నిర్ణయించింది.

టిడిపి - బిజెపిల పొత్తు

టిడిపి - బిజెపిల పొత్తు

ఇక్కడి నుంచి ఇటీవల బిజెపిలో చేరిన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని బరిలోకి దింపాలని బిజెపి మొదట భావించింది. అయితే అర్థబలం, అంగబలం కలిగిన అభ్యర్థి అయితేనే షర్మిలకు గట్టి పోటీ ఇవ్వగలరని, ఈ స్థానం మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు అధికారికంగా బిజెపిలో చేరిన తర్వాత అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

English summary
The TDP today said its alliance with the BJP would cause a political tsunami in Andhra Pradesh in which the other parties would get completely washed away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X