ఏపీ, తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు వీరే
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది.
న్యూఢిల్లీ/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు స్థానానికి నగరూరు రఘవేంద్రను ఖరారు చేసింది.
శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం స్థానానికి పీవీఎస్ మాధవ్‌ను ఎంపిక చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ స్థానానికి వెంకట నారాయణ రెడ్డి పేరును బీజేపీ ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది.
BJP releases a list of three candidates for Biennial Election to Legislative Council of Andhra Pradesh and one candidate for Biennial Election to Legislative Council of Telangana. pic.twitter.com/QfHmKpiKsh
— ANI (@ANI) February 14, 2023
కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో మొత్తం 14 స్థానాల్లో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, 9 స్థానిక సంస్థల స్థానాలు.. తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications