చంద్రబాబుకు బీజేపీ షాక్.. 10 మంది అభ్యర్థుల ఖరారు

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ-బీజేపీ- జనసేన కూటమిగా ఏర్పాటై పోటీచేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన రెండు లోక్ సభ నియోజకవర్గాలు, 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేస్తుండగా భారతీయ జనతాపార్టీ 10 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు 6 లోక్ సభ నియోజకవర్గాల్లో తలపడుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల పేర్లు ఒక కొలిక్కి రావడంతో ఒక్కో పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తున్నాయి. తాజాగా భారతీయ జనతాపార్టీ 10 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. చివరి నిముషంలో ఒకరిద్దరు మినహా దాదాపుగా వీరే పోటీచేస్తారని పార్టీ నేతలు వెల్లడించారు.

పొత్తులో భాగంగా బీజేపీకి విశాఖ నార్త్‌, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్‌, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని నియోజకవర్గాలు దక్కాయి. విశాఖ ఉత్తరం నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్ రాజుతోపాటు మరో పేరు వినిపిస్తోంది. కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నుంచి సురేష్‌, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, ఆదోని నుంచి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.సురేంద్రమోహన్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దాదాపుగా ఇవే ఫైనల్ కానున్నాయి.

bjp ap assembly constituency candidate names final

కైకలూరు నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బదులుగా సోము వీర్రాజు పోటీచేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ పోటీచేసే నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే అభ్యర్థులే పోటీచేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కైకలూరు కచ్చితంగా గెలిచే నియోజకవర్గం కావడంతో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును బరిలోకి దింపుతున్నారు. కామినేనితోపాటు మరో ఇద్దరు నేతల పేర్లు కూడా బీజేపీ అసెంబ్లీ జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో తమకున్న సర్వే ప్రకారం, పార్టీలో చంద్రబాబుకు అనుకూలురైన అభ్యర్థులు కాకుండా తమ సొంత నేతలనే బీజేపీ బరిలోకి దింపుతున్నట్లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+