తెలంగాణ బిల్లుపై ఎవరిది డబుల్ గేమ్: బిజెపిVsకాంగ్రెస్

బిల్లు పెట్టాక బిజెపి వైఖరి బయట పడిందన్నారు. బిజెపి తెలంగాణకు వ్యతిరేకమని ఆరోపించారు. అయితే, దీనిని బిజెపి నేతలు తీవ్రంగా కొట్టి పారేస్తున్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం ఎప్పుడు వ్యతిరేకం కాదంటున్నారు. అదే సమయంలో సుష్మా స్వరాజ్, అద్వానీ చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇస్తున్నారు. కేంద్రం లోకసభలో బిల్లు పెట్టిన తీరును తాము తప్పుపడుతున్నామని, అంతకుముందు రోజు ప్రధాని ఇచ్చిన విందులో ఈ విషయాన్ని తాము స్పష్టంగా చెప్పామని అంటున్నారు.
లోకసభలో శాంతిభద్రతలను నెలకొల్పి తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని తాము కోరామన్నారు. తాము ఆంధ్రప్రదేశ్‌లో ఇరు ప్రాంతాల్లో తెలంగాణకు అనుకూలమని చెబుతున్నామని, కాంగ్రెసు పార్టీ మాత్రం ప్రాంతలవారీగా మాట్లాడుతోందన్నారు. అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రులను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని బిజెపి ప్రశ్నిస్తోంది. కాంగ్రెసులోనే ఏకాభిప్రాయం లేదని, బిజెపిని తప్పుపట్టడమేమిటంటోంది.
కాంగ్రెసు పార్టీ తమ నేతలను అదుపులో పెట్టాక తమ వద్దకు రావాలని సూచిస్తోంది. లోకసభలో బిల్లు ప్రవేశ పెట్టారని చెబుతున్న తీరునే తాము వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని చెబుతున్నారు. లోకసభ ఘటనకు కాంగ్రెసు పార్టీయే బాధ్యత వహించాలని చెబుతున్నారు. గురువారం రాత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మాట్లాడుతూ తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, ఈ సమావేశాల్లో బిల్లు పెడితే మద్దతిస్తామంటున్నారు.












Click it and Unblock the Notifications