పవన్ కళ్యాణ్ కష్టపడితే, చంద్రబాబు అధికారం: రూటుమార్చిన బిజెపి, కాంగ్రెస్
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీలు రెండున్నర సంవత్సరాల తర్వాత రూటు మార్చాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్.. బిజెపి - టిడిపి కూటమికి మద్దతు పలికిన విషయం తెలిసిందే.
అది పవన్ కల్యాణ్ వ్యక్తిగతం: సోము వీర్రాజు, "చెల్లని డ్రగ్ లాంటివాడు"
నాటి నుంచి నిన్న ప్రత్యేక హోదా పైన బీజేపీని నిలదీసే వరకు కమలం పార్టీ నాయకులు ఆయనను ఆకాశానికెత్తారు. ఎప్పుడైతే ప్రత్యేక హోదా పైన ఘాటుగా నిలదీశారో.. అప్పటి నుంచి ఎదురు దాడి ప్రారంభించారు.
అసహనం, వెంకయ్య తర్వాత మరో షాక్: పవన్ కళ్యాణ్‌ను చాచికొట్టిన బిజెపి!
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నుంచి చిన్న స్థాయి నాయకుల వరకు పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ షాకింగా కామెంట్లు చేశారు. అసలు జనసేనతో తాము కలవలేదని, ఆయన తమకు మద్దతు మాత్రమే ఇచ్చారని చెప్పారు.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీయే తమ మిత్రపక్షమని చెప్పారు. పవన్ ప్రత్యేక హోదా పైన ఘాటుగా ప్రశ్నించడం, వరుసగా సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బీజేపీ మాట మారింది.
ఇక, సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి - బిజెపికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటైన వ్యాఖ్యలు చేయనప్పటికీ.. ఆయనను ప్రశ్నించారు.
ఇప్పుడు బిజెపి నేతల మాటలతో.. పవన్ కళ్యాణ్‌ను వాడుకొని వదిలేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు బిజెపిని దుయ్యబడుతున్నారు. బుధవారం నాడు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... టిడిపి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కష్టపడ్డారని, కానీ చంద్రబాబు అధికారం అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications