తమాషాగా ఉందా.. ఈనెల 26న ఢిల్లీకి రండి!

బీజేసీ అసమ్మతివాదులంతా మంగళవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీలో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిష్క్రమంచిన తర్వాత అసమ్మతివాదులంతా రోజురోజుకు గళం విప్పుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారం తేల్చాలని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావుతోపాటు నలుగురు నేతలు పెత్తందారీ తనాన్ని చూపిస్తున్నారని, వాటిని భరించలేకున్నామంటూ భారతీయ జనతాపార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.

రంగంలోకి దిగిన శివప్రకాష్

రంగంలోకి దిగిన శివప్రకాష్


తాజాగా బీజేసీ అసమ్మతివాదులంతా మంగళవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ అధిష్టానానికి ఈ విషయం తెలిసింది. ఏపీ వ్యవహారాలను చూస్తున్న శివప్రకాష్ రంగంలోకి దిగారు. ఎటువంటి మీటింగ్ లు పెట్టవద్దని, అలాంటి చర్యలతో పార్టీ పరువు దెబ్బతింటుందని కోరారు. దీంతో రెబల్స్ మెత్తబడ్డారు. ఈనెల 26వ తేదీన ఢిల్లీ రావాలంటూ పార్టీలోని అసమ్మతి వాదులకు సమాచారం పంపించారు. అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అన్ని విషయాలు మాట్లాడుకుందామని సూచించారు.

సోముకు వ్యతిరేకంగా నివేదిక?

సోముకు వ్యతిరేకంగా నివేదిక?


అసమ్మతివాదులు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా వీరంతా చర్చించుకొని అన్ని వివరాలను నివేదికలో సిద్ధం చేయబోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు వెళ్లిపోయారు? కారణాలేంటి? అసలేం జరిగింది? తదితర విషయాలను కూడా అందులో పొందుపరచనున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ తప్పిదాలను ఎండగడుతూ పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో కొంతమంది నాయకులు వైసీపీతో కలిసి సొంత పార్టీని దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపిస్తున్నారు. అలాగే కన్నా హయాంలో నియమితులైన ఆరుగురు జిల్లా అధ్యక్షులను తొలగించిన తీరును కూడా ప్రస్తావించబోతున్నారు.

అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న సోము?

అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న సోము?


సోము వీర్రాజుపై వస్తున్న అవినీతి ఆరోపణలను అసమ్మతి వాదులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అండతో వీర్రాజు కొన్ని అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి ప్రయోజనాలను ఆశించే వైసీపీకి వీర్రాజు కొమ్ము కా్స్తున్నారన్నది పార్టీలో పలువురి వాదన. మరి ఈ నెల 26న నడ్డా ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారో చూడాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+