ఎక్కడ, ఎన్ని?: బిజెపి సీట్ల ఆఫర్, టైం కావాలని పవన్!

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ సీట్ల విషయంలో ఆఫర్ ఇచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని అసెంబ్లీ, లోకసభ స్థానాలను కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పవన్‌కు బిజెపి చెప్పిందట. అయితే, సీట్ల విషయమై కాస్త సమయం కావాలని పవన్ కళ్యాణ్ పార్టీ చెప్పినట్లుగా తెలుస్తోంది.

రానున్న సార్వత్రిక ఎన్నికలలో పవన్ బిజెపికి మద్దతివ్వనున్న విషయం తెలిసిందే. అయిదు రోజుల క్రితం పవన్ అహ్మదాబాద్ వెళ్లి గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అనంతరం తన మద్దతు మోడీకి ఉంటుందని చెప్పారు.

BJP has offered Pawan's Jana Sena LS and Assembly seats

పవన్ తమ పార్టీకి మద్దతు తెలపడంతో రాష్ట్ర బిజెపిలోని కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇప్పటికే నరేంద్ర మోడీ హవా కనిపిస్తోందని, పవన్ కళ్యాణ్ మద్దతుతో అది మరింత ఉంటుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. లోక్ సత్తా పార్టీ కూడా బిజెపితో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే, జనసేన పార్టీ పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ పోటీ పైన ఉత్కంఠ నెలకొంది. పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదని, బిజెపికి ప్రచారం మాత్రమే చేసి పెడతారని చెబుతున్నారు. అవసరమైతే తమ పార్టీ తరఫున కొందరు అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశముందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+