టీడీపీకి దూరంగా బీజేపీ, తెర వెనుక రాజకీయం - చంద్రబాబుకు నష్టమేనా..!!

జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రతిపక్ష కూటమి బెంగళూరులో సమావేశం అవుతోంది. ఎన్డీఏ మిత్రపక్షాలు ఢిల్లీలో భేటీ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన కు ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం అందింది. గతంలో ఎన్డీఏ పాత మిత్రులకు బీజేపీ ఆహ్వానాలు పంపింది. టీడీపీకి మాత్రం పిలుపు రాలేదు. 2019 రాజకీయం వెంటాడుతున్నట్లు స్పష్టం అవుతోంది. బీజేపీ మద్దతు లేకపోతే చంద్రబాబు కు నష్టమేనా అనే చర్చ మొదలైంది.

టీడీపీకి నవ్ ఆర్ నెవర్
వచ్చే ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్. ఈ ఎన్నికల్లో గెలిచి సీఎం అయితేనే చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టేది. వైసీపీని ఓడించటంలో పొత్తులు కీలకమని టీడీపీ భావిస్తోంది. జనసేనతో పొత్తు ఖాయమనే ప్రచారం సాగుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి 2014 ఎన్నికల తరహాలో పోటీ చేసి అదే విధంగా సీఎం కావాలనేది చంద్రబాబు ఆలోచన.

Bjp

పవన్ తో అంతా సెట్ అయినా..బీజేపీతో మాత్రం సంధి కుదరటం లేదు. ఎన్డీఏ సమావేశానికి జనసేనకు ఆహ్వానం అందింది. ఎన్డీఏను వీడిన పాత మిత్రులు శిరోమణి అకాలీ దల్ వంటి పార్టీలకు పిలుపు వచ్చింది. కానీ, టీడీపీని మాత్రం ఆహ్వానించ లేదు. దీని ద్వారా టీడీపీ ఆశ లకు బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది.

టీడీపీతో నో అంటున్న బీజేపీ
జగన్ ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేది చంద్రబాబు, పవన్ వ్యూహం. బీజేపీతో ఏపీలో ఓట్ల పరంగా ప్రయోజనం లేకపోయినా...ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ పరిస్థితుల్లోనూ జగన్ ను అనుకూలంగా ఉండకూడదనేది ఆ ఇద్దరి లక్ష్యం.

అందులో భాగంగానే బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతూనే టీడీపీతోనూ కలిసేందుకు బీజేపీ నేతలతో పవన్ మంతనాలు చేసారు. కొంత మేర సఫలం అయినట్లు కనిపించినా..ఫలితం మాత్రం రాలేదు. ఇప్పుడు పవన్ కు బీజేపీకి మరింత దగ్గరయ్యారా. తన మిత్రుడు చంద్రబాబును దగ్గర చేయగలరా అనేది ఆసక్తికర అంశం. ఇదే సమయంలో చంద్రబాబుతో ఇక దూరమనే సంకేతాలు బీజేపీ ఇస్తోంది.

అదే జరిగితే భారీ నష్టం
ఏపీలో ఇటు పవన్ తో పొత్తు కొనసాగిస్తూనే...సీఎం జగన్ తోనూ కేంద్రంలోని ముఖ్యులు సన్నిహితంగా ఉంటున్నారు. చంద్రబాబు తో మాత్ర నో అంటున్నారు. పవన్ ను పూర్తిగా తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు బీజేపీ ముమ్మరం చేసింది. కొత్త ప్రతిపాదనలకు సిద్దమైంది. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందుకు రాకపోతే చంద్రబాబుకు జరిగే నష్టం చాలా స్వల్పమనే అభిప్రాయం ఉంది.

అదే బీజేపీ పవన్ ను కూడా టీడీపీ తో వెళ్లకుండా నియంత్రిస్తే భారీ నష్టం తప్పదు. అప్పుడు టీడీపీ వామపక్షాలతో మాత్రమే కలిసి వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగి ఏపీలో బహుముఖ పోటీ నెలకొంటే అది పరోక్షంగా జగన్ కు మేలు చేస్తుంది. దీంతో, బీజేపీ పిలినిచా..లేకున్నా...టీడీపీ వేచి చూసే ధోరణితో ఉంది. పవన్ పాత్ర కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+