టిడిపిలో చేరేందుకు క్యూ: '2019లో బిజెపి, జనసేన మాతోనే'

2019 ఎన్నికల్లో బిజెపి, జనసేనలతో కలిసే పోటీ చేస్తామని టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు. నంద్యాల, కాకినాడ ఫలితాలతో అహంకారం కానీ, అతి విశ్వాసం పెరగలేదన్నారు.

అమరావతి:2019 ఎన్నికల్లో బిజెపి, జనసేనలతో కలిసే పోటీ చేస్తామని టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు. నంద్యాల, కాకినాడ ఫలితాలతో అహంకారం కానీ, అతి విశ్వాసం పెరగలేదన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పర్యటిస్తున్నట్టు చెప్పారు.

2019 ఎన్నికలకు టిడిపి ఏ రకంగా వ్యూహలను రచిస్తోంది. ప్రభుత్వం ముందున్న కర్తవ్యాలు ఏమిటనే విషయాలపై టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తన అభిప్రాయాలను ప్రకటించారు.

Recommended Video

    IEBF International Excellence Award For Pawan Kalyan | Oneindia Telugu

    ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కళా వెంకట్రావు చెప్పారు.

    లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది మార్గంలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలను సాగిస్తున్నట్టు కళా వెంకట్రావు చెప్పారు.ప్రజలు తమపై విశ్వాసాన్ని ఉంచి అధికారాన్ని కట్టబెట్టారని , ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకొంటామని కళా వెంకట్రావు చెప్పారు.

    నంద్యాల, కాకినాడ ఫలితాలతో అహంకారం పెరగలేదు

    నంద్యాల, కాకినాడ ఫలితాలతో అహంకారం పెరగలేదు

    నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలతో అతి విశ్వాసం పెరగలేదని టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ప్రకటించారు.ఈ ఫలితాలతో ప్రజలు టిడిపిపై విశ్వాసాన్ని పెంచుకొన్నారని తేలిపోయిందని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు.పార్టీలో గానీ, చంద్రబాబులో గానీ అతి విశ్వాసం ఉండదు. మంచి ఫలితాలు వచ్చాక కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్లి.. వారికి చేరువయ్యేందుకు ఇల్లిల్లూ తిరగాలనే ఇంటింటికి తెలుగుదేశం మొదలుపెట్టినట్టు కళా వెంకట్రావు చెప్పారు.

    2019లో మెజారిటీ సీట్లు గెలుచుకొంటాం

    2019లో మెజారిటీ సీట్లు గెలుచుకొంటాం

    2014 ఎన్నికల్లో తమపై నమ్మకాన్ని ఉంచి బిజెపితో కలుపుకొని 106 స్థానాల్లో విజయం అందించారని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు.అయితే 2019 ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలను మిత్రపక్షాలతో కలిపి గెలుచుకోవాలని భావిస్తున్నామని వెంకట్రావు అభిప్రాయపడ్డారు.బిజెపి, జనసేన కూడ వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు కళా వెంకట్రావు.

    వారసులు రావడంలో తప్పేముంది?

    వారసులు రావడంలో తప్పేముంది?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో 15 లేదా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రస్తుతం టిడిపిలో ఉన్న నేతల కొడుకులు, కూతుళ్ళు రాజకీయాల్లో వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని వెంకట్రావు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ తరహ వారసత్వ రాజకీయాలు అన్ని పార్టీల్లో ఉన్నాయని గుర్తు చేశారు వెంకట్రావు. ముఖ్య నేతలతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా పనిచేస్తుంటారు. వారు ఆసక్తితోనే రాజకీయాల్లోకి వస్తుంటారు. ఎవరికి కెపాసిటీ ఉంటే పార్టీ వారిని ప్రోత్సహిస్తుంది.

    తప్పులు దిద్దుకోకపోతే చర్యలు తప్పవు

    తప్పులు దిద్దుకోకపోతే చర్యలు తప్పవు

    చంద్రబాబునాయుడు పార్టీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుపోవాలని చూస్తుంటారు. అయితే పార్టీకి నష్టం కల్గించే చర్యలకు ఎవరు పాల్పడిన చంద్రబాబునాయుడు సహించబోరని చెప్పారు కళా వెంకట్రావు.పరివర్తన తేవడం ద్వారా తప్పులు దిద్దుకొనే అవకాశమివ్వాలనేది చంద్రబాబునాయుడు ఫిలాసఫీ అని వెంకట్రావు గుర్తుచేశారు.. ఈ పద్ధతి వల్ల పార్టీ ఐక్యంగా ఉంటోంది. విజయాలు సాధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల నేతల్లో భయం పోయిందనడం నిజం కాదు. ఆయన ఎవరినైనా ముందే పిలిచి హెచ్చరిస్తారు. తప్పులు దిద్దుకోవాలని సూచిస్తారు. అవి అంతర్గతంగా జరుగుతాయని వెంకట్రావు చెప్పారు.

    ప్రజలు టిడిపి పాలనపై సంతృప్తిగా ఉన్నారు.

    ప్రజలు టిడిపి పాలనపై సంతృప్తిగా ఉన్నారు.

    లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్నామని కళా వెంకట్రావు చెప్పారు. తమ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పేందుకు నంద్యాల, కాకినాడ ఫలితాలే నిదర్శనమని చెప్పారు.ఈ మూడేళ్లలో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మించుకున్నాం. లోటు కరెంటును అధిగమించి మిగులు స్థితికి వచ్చాం. లాఠీచార్జీలు, క్యూలలో పడిగాపులు లేకుండా రైతులకు ఎరువులు, విత్తనాలిచ్చాం. రూ.24 వేల కోట్ల మేర రుణ మాఫీచేశాం. డ్వాక్రా సంఘాలకు ఆర్థిక సాయం చేసినట్టు చెప్పారు.అమరావతిని మెడికల్‌ హబ్‌ చేస్తున్నాం. రాయలసీమకు కియా కార్ల కంపెనీ వంటి పరిశ్రమలు తెచ్చాం. కాపులు, బ్రాహ్మణులు, ముస్లింలు, బీసీలను ఆదుకుంటున్నాం. ప్రజల్లో ఉన్న సంతృప్తి ఇటీవలి ఎన్నికల్లో ప్రతిఫలించిందని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు.

    టిడిపిలో చేరడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు

    టిడిపిలో చేరడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు

    రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు అధికార పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారు. గెలిచినవారు వస్తానంటే వద్దనలేమని కళా వెంకట్రావు చెప్పారు.
    . సొంత లాభం కొంత మానుకొని కలుపుకొని పోవాల్సిన పరిస్థితులున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉందని చెప్పారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. పార్టీలోకి ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. వారిని కూడా తీసుకుంటామని చెప్పారు కిమిడి కళా వెంకట్రావు.

    తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నాం

    తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నాం

    మూడేళ్లుగా రాష్ట్రాభివృద్ది కోసం కష్టపడుతున్నట్టు చెప్పారు కళా వెంకట్రావు. తాము పడుతున్న కష్టానికి ప్రజలు మంచి ఫలితాలు ఇచ్చారని చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతిపక్షం మమ్మల్ని విమర్శిస్తుంటుంది. వారి విమర్శలను మేం స్వీకరించి మా తప్పులుంటే దిద్దుకుంటామని చెప్పారు కళా వెంకట్రావు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+