టీడీపీ ముద్ర ఉంటే నో టికెట్ - బీజేపీ హైకమాండ్ భారీ ట్విస్ట్..!!
ఏపీలో పొత్తుల వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నా... సొంత ముద్ర ఉండేలా జాగ్రత్త పడుతోంది. బీజేపీతో పొత్తు ఉన్నా..టీడీపీ నుంచి వచ్చిన వారికే సీట్లు కేటాయిస్తారనే అనుమానాల పై స్పష్టత ఇచ్చింది. టీడీపీ ముద్ర ఉన్న వారికి సీట్లు ఇచ్చేది లేదని తేల్చేసింది. పూర్తిగా బీజేపీలో కొనసాగిన వారినే అభ్యర్దులుగా దించాలని నిర్ణయించింది. దీంతో..బీజేపీ నుంచి పోటీకి ఆశిస్తున్న మాజీ టీడీపీ నేతలకు షాక్ తప్పేలా లేదు.
పొత్తులు - సీట్లు : ఏపీలో పొత్తులు ఖాయమయ్యాయి. 2014 పొత్తులు రిపీట్ కానున్నాయి. టీడీపీ అధికారంగా ఎన్డీఏలో చేరేందుకు రంగం సిద్దం అవుతోంది. పొత్తుల్లో భాగంగా సీట్ల సంఖ్య పైనే ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా చర్చలు సాగుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్లు ఖరారైన తరువాత పొత్తు పైన అధికారికంగా ప్రకటన రానుంది. అయితే, ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా తమ పార్టీ నుంచి సీట్లు ఖరారు చేసే విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరి ఇప్పుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారికి సీట్ల విషయంలో స్పష్టత ఇచ్చింది. టీడీపీ ముద్ర ఉన్న వారికి సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. పూర్తిగా పార్టీ శ్రేణులకే సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయింది.

బీజేపీ ముద్ర : 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిన తరువాత నాటి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ తో పాటుగా, వరదాపురం సూరి, ఆదినారాయణ రెడ్డి లాంటి వారు టీడీపీలో చేరారు. ఇప్పుడు పొత్తులు ఖరారైన వేళ వీరిలో పలువురు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి అభ్యర్దులుగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ నుంచి సీఎం రమేష్, విజయవాడ నుంచి సుజనా చౌదరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు బీజేపీ తాజా నిర్ణయంతో వీరిలో ఎవకిరి సీట్లు దక్కుతాయి.. ఎవరిని పక్కన పెడతారనే చర్చ మొదలైంది. విశాఖ నుంచి జీవీఎల్ నర్సింహారావు, రాజమండ్రి నుంచి పురందేశ్వరి పేర్లు రేసులో ఉన్నాయి.

పోటీలో నిలిచేదెవరు : అదే విధంగా పొత్తులో భాగంగా విజయవాడ సీటు దక్కితే గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఒక ముఖ్య నేత పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక..ఎమ్మెల్యేలుగా పార్టీలో సుదీర్ఘ కాలం పని చేస్తేన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో, ఇప్పుడు బీజేపీ ఎవరికి సీట్లు దక్కుతాయనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు, పవన్ దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. సీట్ల అంశం పైనే ప్రధానంగా ఈ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లతో పోటీ చేస్తారనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీని పైన అధికారికంగా ప్రకటన వచ్చిన తరువాత సీట్లు..అభ్యర్దుల ప్రకటన ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications