బీజేపీ కొత్త ఫిట్టింగ్ - టీడీపీ, జనసేన సీట్లలో మార్పులు..!!

ఏపీలో పొత్తులు ఖరారయ్యాయి. సీట్ల లెక్క మాత్రం ఇంకా తేలలేదు. టీడీపీ ఇప్పటికే పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య పైన క్లారిటీ ఇచ్చింది. సంఖ్య ఖాయం అయినా...నియోజకవర్గాల విషయం లో మాత్రం అంచనాలు మారుతున్నాయి. తాజాగా బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన పురందేశ్వరి వద్ద తాజాగా స్థానాల పైన చర్చలు మొదలయ్యాయి. బీజేపీ తాజా ప్రతిపాదనలతో టీడీపీ సీట్లలో మార్పు పైన చర్చ మొదలైంది.

సీట్ల పంచాయితీ : ఎన్డీఏ కూటమిలో బీజేపీ పోటీ చేసే సీట్ల పంచాయితీ ఇంకా తేలలేదు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు ఖాయం చేసారు. అందులో భాగంగా నియోజకవర్గాల పైన అమరావతి కేంద్రంగా బీజేపీ నేత షెకావత్, చంద్రబాబు, పవన్ జరిపిన చర్చల్లో ఒక అంచనాకు వచ్చారు. అయితే, ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలతో సీట్ల మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. తమ పార్టీకి కేటాయిస్తార ని భావించిన పాడేరు, అనపర్తి, ఆదోని, గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అదే విధంగా ఎంపీ స్థానాల్లో విజయనగరం, అనకాపల్లి, అరకు ఎంపీ స్థానాలు మార్పు చేసి వేరే సీట్లు కోరే అవకాశం ఉంది.

BJP latest proposals on contesting seats in AP As Alliance with TDP and Janasena

స్థానాల మార్పు : బీజేపీ నుంచి రాయల సీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 అసెంబ్లీ స్థానాలకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ ఆశించిన సీట్లు పొత్తులో భాగంగా కొన్ని చోట్ల దక్కలేదు. మరికొన్ని చోట్ల బలం లేకున్నా బరిలో దిగాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యల్ని ఎలా అధిగమించాలనే విషయంపై చర్చించేందుకు పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇతర ముఖ్యనేతలు ఢిల్లీకి వెళ్లారు. ఎంపీ స్థానాల్లో విజయనగరం పేరు ఇప్పటి వరకు వినిపిస్తుండగా దీని స్థానంలో అమలాపురం సీటు బీజేపీకి దక్కవచ్చని తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థానాల్లో భాగంగా రాయలసీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 అసెంబ్లీ స్థానాలకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ ఆశించిన సీట్లు పొత్తులో భాగంగా కొన్ని చోట్ల దక్కలేదు. దీంతో, కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ, జనసేన స్థానాలు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

BJP latest proposals on contesting seats in AP As Alliance with TDP and Janasena

తుది కసరత్తు : తాము కేటాయించిన స్థానాల్లో అభ్యర్దులను మార్చితే సమస్యలు వస్తాయని టీడీపీ నాయకత్వం చెబుతోంది. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న స్థానాల మేరకు పోటీకి దిగుదామని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే, బీజేపీ నుంచి వస్తున్న తాజా ప్రతిపాదనలు..స్పష్టత రాని కారణంగానే టీడీపీ ఎంపీ అభ్యర్దుల ప్రకటన నిర్ణయం వాయిదా పడింది. జనసేనాని తాము కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేస్తామని స్పష్టత ఇచ్చారు. బీజేపీ ఎంపీ స్థానాలతో పాటుగా అసెంబ్లీ స్థానాల పైన పట్టు బడుతోంది. దీంతో, ఇప్పుడు చంద్రబాబు బీజేపీ చేస్తున్న తాజా ప్రతిపాదనల్లో వేటికి అంగీకరిస్తార..చివరగా ఏ స్థానాల్లో మార్పులు జరుగుతాయనేది ఇప్పుడు కూటమి ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+