ఆ నిధులకు లెక్కలేవీ, ఏపీని బాబు అప్పుల్లోకి నెట్టాడు, సినిమా డైరెక్టర్లతో డిజైన్లా?: కన్నా
అమరావతి: కేంద్రం నుండి వచ్చిన నిధులకు లెక్కలు చూపలేదని బిజెపి నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కనీసం డీపిఆర్‌లు ఇవ్వకుండా నిధులు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఎలా నిధులను మంజూరు చేస్తోందని కన్నాలక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబారా ఖర్చులు చేస్తూ రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
టిడిపిపై బిజెపి నేతలు ఇటీవల కాలంలో విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు టిడిపిపై చేస్తున్న విమర్శలకు తోడుగా మరో బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కూడ జత కలిశారు.
Recommended Video

బుదవారం నాడు బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ టిడిపి నేతలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి నేతలు విమర్శలు చేశారు.

ఏపీని టిడిపి అప్పుల పాలు చేసింది
ఏపీ రాష్ట్రాన్ని టిడిపి ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు.ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజల డబ్బును వృథాగా ఖర్చు చేస్తున్నారని, అనవసర ఖర్చులతో ఏపీని అప్పులు పాలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.ప్రభుత్వానికి పని తక్కువ, ప్రచార ఆర్భాటాలు ఎక్కువని విమర్శించారు.

రాజధానికి సినిమా డైరెక్టర్లతో డిజైన్లు సమంజసమా
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయితే ఈ నిధులతో ఏయే నిర్మాణాలు చేపట్టారో చెప్పాలని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయన ప్రశ్నించారు. ఇచ్చిన సొమ్ముకు లెక్కలు చూపని ఏపీ ప్రభుత్వం, కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేదని, పైగా నిధులు ఇవ్వమని కేంద్రాన్ని కోరుతోందని విమర్శించారు. సినిమా డైరెక్టర్‌తో రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు చేయిస్తారా అని బిజెపి నేతల కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

కొనసాగుతున్న బిజెపి నేతల విమర్శలు
ఏపీ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వంపై టిడిపి నేతలపై కొందరు బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపి నేతల తీరుపై టిడిపి నేతలు కూడ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు టిడిపి నేతలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై బిజెపి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. తాజాగా మరో బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కూడ టిడిపిపై విమర్శలు గుప్పించారు.

ఉద్దేశపూర్వకంగానే విమర్శలా
టిడిపిని లక్ష్యంగా చేసుకొని కొందరు బిజెపి నేతలు ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. బిజెపి నేతలు అందరూ కూడ విమర్శలు చేయకపోయినా, కొందరు మాత్రం పనిగట్టుకొని టిడిపిపై విమర్శలు చేయడంపై టిడిపి నేతలు అనుమానాలను కూడ వ్యక్తం చేస్తున్నా
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications